టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల క్రితం అభినయ ప్రధాన పాత్రలతో మెప్పించిన నటీమణులలో అసిన్ (Asin) ఒకరు. గజిని, ఘర్షణ (Gharshana) , లక్ష్మీ నరసింహ (Lakshmi Narasimha) సినిమాలలో అసిన్ అద్భుతంగా నటించి ఆ సినిమాలతో ఆకట్టుకున్నారు. అసిన్ భర్త రాహుల్ శర్మ గురించి చాలామంది అభిమానులకు తెలియదు. అసిన్ భర్త 3 లక్షల అప్పుతో కెరీర్ ను మొదలుపెట్టి 1300 కోట్ల రూపాయలు సంపాదించడం గమనార్హం. మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్, సీఈవో అయిన రాహుల్ శర్మ ప్రస్తుతం వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నారు.
రాహుల్ శర్మ కొంతమంది స్నేహితులతో కలిసి 2000 సంవత్సరంలో మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ ను స్థాపించారు. ఈ కంపెనీ మొదట ఐటీ కంపెనీగా మొదలైంది. 2008 సంవత్సరంలో ఈ సంస్థ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం గమనార్హం. 2010 సంవత్సరం సమయానికి ఈ సంస్థ తక్కువ ధరకే మొబైల్ ఫోన్లను అందిస్తూ దేశంలోని ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలలో ఒకటిగా నిలిచింది.
చదువు పూర్తైన తర్వాత తండ్రి నుంచి 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న రాహుల్ శర్మ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం 1300 కోట్ల రూపాయలుగా ఉంది. రాహుల్ శర్మ రివోల్ట్ ఇంటెల్లికార్ఫ్ ఫౌండర్ కాగా ఆయన 2017లో మన దేశంలో మొదటి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్ ను పరిచయం చేశారు. 2016 సంవత్సరంలో రాహుల్ శర్మ, అసిన్ దంపతుల పెళ్లి జరిగింది.
ఈ దంపతులకు ఒక కూతురు ఉండగా ఆ కూతురి పేరు అరిన్ రేన్ కావడం గమనార్హం. ప్రస్తుతం అసిన్ దంపతులు ఢిల్లీలో లగ్జరీ ఫామ్ హౌస్ లో నివశిస్తున్నారు. రాహుల్ శర్మ దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. అసిన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అసిన్, రాహుల్ శర్మ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.\