Pawan Kalyan: ఆ ఉంగరం పవన్ జాతకాన్ని మారుస్తుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలవుతున్నా భీమ్లా నాయక్ సినిమా బాగానే కలెక్షన్లను సాధిస్తోంది. పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. 2024 సంవత్సరంలో ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తుండటం గమనార్హం. ఇటీవల జనసేన 9వ ఆవిర్భావ సభ జరగగా ఈ సభకు లక్షల సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చారనే సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

అయితే ఈ సభలో మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ ధరించిన ఉంగరం హైలెట్ అయింది. పవన్ కళ్యాణ్ ధరించిన ఉంగరం పగడపు ఉంగరం అని సమాచారం. జాతకంలోని దోషాలు తొలగిపోవడానికి సాధారణంగా ఇలాంటి ఉంగరాలను ధరించడం జరుగుతుంది. పవన్ దేవుళ్లను నమ్ముతారు. ఆచారసాంప్రదాయాలకు పవన్ కళ్యాణ్ ఎంతో విలువ ఇస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కుడిచేతి ఉంగరపు వేలికి ఈ ఉంగరాన్ని ధరించడం గమనార్హం. త్రివిక్రమ్ సూచనల మేరకు పవన్ ఈ ఉంగరాన్ని ధరించి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎంతగానో నమ్ముతారనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ జాతకాన్ని జ్యోతిష్యునికి చూపించారని పవన్ పొలిటికల్ కెరీర్ కు ఆ ఉంగరం ప్లస్ అవుతుందని సమాచారం. ఆ ఉంగరం బరువు 4 క్యారెట్లు అని తెలుస్తోంది. ఆ రింగ్ వల్ల పవన్ జాతకం మారి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు పవన్ సినిమాల షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus