RRR Movie: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కొత్త డేట్ ఇదేనా?

ఈ నెల మూడవ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ విడుదలవుతుందని భావించిన ఫ్యాన్స్ కు ఆర్ఆర్ఆర్ మేకర్స్ చేసిన ప్రకటన వల్ల నిరాశ ఎదురవుతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం, ఇతర కారణాల వల్ల ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. అయితే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఎప్పుడు రిలీజవుతుందనే ప్రశ్నకు సమాధానంగా రెండు తేదీలు వినిపిస్తున్నాయి. ఈ నెల 6వ తేదీన లేదా 12వ తేదీన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న పుష్ప సినిమా ట్రైలర్ ఈ నెల 6వ తేదీన రిలీజ్ కానుంది. ఒకేరోజు పుష్ప, ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజైతే మాత్రం యూట్యూబ్ లో నయా రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని చెప్పవచ్చు. ప్రేక్షకులు ఈ రెండు సినిమాల ట్రైలర్లను పోల్చి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. రెండ్ ట్రైలర్ల క్లాష్ జరిగితే మాత్రం యూట్యూబ్ లో అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు.

పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాగా అటు సుకుమార్ ఇటు రాజమౌళి తమ సినిమాల ఫలితాల విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పుష్ప పార్ట్1 సక్సెస్ సాధిస్తే పుష్ప పార్ట్2 త్వరగా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బన్నీ మార్కెట్ ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేయగా ఈ సినిమాకు అదే స్థాయిలో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. రంగస్థలం మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఇదే కావడం గమనార్హం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus