‘గుంటూరు కారం’ సినిమా పోస్టర్ చూసి కథ, కథనాలు చెప్పేయొద్దు.. అసలు కథ వేరే ఉందని మొన్నీ మధ్యే చెప్పుకున్నాం గుర్తుందా? ఇప్పుడు మరో విషయం కూడా బయటకు వచ్చింది. అది కానీ నిజం అయితే ‘గుంటూరు కారం’ ఘాటు ఇటు సినిమాలకు, అటు పాలిటిక్స్‌కు కూడా తగులుతుంది అంటున్నారు. పాలిటిక్స్ అంటున్నారు.. కొంపదీసి ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ కాదు కదా అంటారా? అవును అలాంటిదే కానీ.. ఓన్లీ పొలిటికల్ థ్రిల్లర్ కాదు అంటున్నారు.
‘గుంటూరు కారం’ పోస్టర్లు, వీడియోల్లో బీడీతోనే మహేష్ కనిపిస్తున్నాడు. దీంతో మాస్ సినిమా అవ్వొచ్చు అనే ఫీలింగ్ కలుగుతోంది సగటు ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు. కానీ థియేటర్లకు సినిమా వచ్చేసరికి క్లాస్ టచ్ ఉన్న మాస్ సినిమా అనే ఫీల్ కలుగుతుందట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘అల వైకుంఠపురములో’ టైప్లో ఈ సినిమాను క్లాస్ + మాస్ కాంబినేషన్‌లో రూపొందిస్తున్నారట. అయితే దీనికి పాలిటిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటున్నారు.
ఈ సినిమాలో మహేష్‌కు తాతగా ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారని సమాచారం. ఆయన గుంటూరు ప్రాంతంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా సినిమాలో కనిపిస్తారట. ఓ సందర్భంలో తన తాత కోసం మహేష్ భారీ స్థాయిలో వార్నింగ్ ఇస్తాడట. ఆ సీన్‌లో మహేష్ విశ్వరూపం చూస్తారు అని సినిమా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ‘అతడు’ సినిమాలో పొలంలో వార్నింగ్ అండ్ ఫైట్ సీన్ ఉంది కదా… అంతకుమించి ఈ సీన్ ఉంటుంది అంటున్నారు.
నిజానికి సినిమా నుండి దసరాకు ఓ అప్‌డేట్ రావాల్సి ఉంది. అయితే దానికి దీపావళికి పోస్ట్ పోన్ చేశారు. ఇక సినిమాను అయితే సంక్రాంతికి తీసుకొస్తామని గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నారు. అనుకున్నట్లే పెద్ద పండగకు సినిమా వస్తుందని అంటున్నారు. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ అండ్ కో. పని చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ ఘాటను జనవరి 12న చూడొచ్చు.