Mahesh , Charan: మహేష్, చరణ్ ల గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయం

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇద్దరూ కూడా స్టార్ కిడ్స్… అలాగే ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా మహేష్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే స్టార్ స్టేటస్ ను దక్కించుకోవడానికి ఎక్కువ టైమే పట్టింది. డెబ్యూ హీరోగా మాత్రం తొలి సినిమాతోనే రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. రాంచరణ్ అయితే మొదటి రెండు సినిమాలతోనే స్టార్ హీరోగా ఎదిగాడు.

రాజమౌళితో చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. త్వరలో మహేష్ బాబు కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.మహేష్ – చరణ్ లానే నమ్రత – ఉపాసన లు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. చరణ్ – ఉపాసనలకి మహేష్ కూతురు సితార అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు – రాంచరణ్ ఇద్దరూ కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కూడా కులాంతర వివాహం చేసుకున్నవారే..!

అయితే వీళ్ళిద్దరినీ తన ఇంటల్లుళ్ళుగా చేసుకోవాలని టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆశించాడట. అతని పెద్ద కూతుర్ని మహేష్(Mahesh) కు, చిన్న కూతుర్ని రాంచరణ్ కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడట. ఇందుకు వీరి తండ్రులైన కృష్ణ, చిరంజీవి కూడా అంగీకరించాడు అని తెలుస్తుంది. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా..! మహేష్, చరణ్ లు ప్రేమ వివాహానికి రెడీ అయ్యారు. అలాగే ఆ స్టార్ ప్రొడ్యూసర్ కూతుర్లు కూడా ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus