RC16: వామ్మో.. బుచ్చిబాబు చరణ్ రోల్ ను ఈ రేంజ్ లో ప్లాన్ చేశారా?

చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ కు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యులు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వైష్ణవ్ తేజ్ తో బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. చరణ్ తో రెండో సినిమా చేసే అవకాశం రావడంతో ఈ సినిమాతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా కథకు సంబంధించి షాకింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో కోడి రామ్మూర్తి నాయుడు రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. బాడీ బిల్డర్ కోడి రామ్మూర్తి రియల్ లైఫ్ స్టోరీని స్పూర్తిగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా. వైజాగ్ లోని వీరఘట్టం గ్రామానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు రెజ్లర్ గా బాడీ బిల్డర్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు ఇండియన్ హెర్క్యూలెస్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు.

ఆయన సాహసాల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఓటమి ఎరుగని ధీరుడు అయిన కోడి రామ్మూర్తి జీవితంలోని ముఖ్యమైన ఘటనలను ఆధారంగా చేసుకుని కొంత ఫిక్షన్ జోడించి బుచ్చిబాబు ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లలో చరణ్ పాత్రలకు సంబంధించి షాకింగ్ ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది.

బుచ్చిబాబు చరణ్ ను సరికొత్తగా చూపించనున్నారని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. స్టార్ హీరో రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus