అసలే వరుసబెట్టి నాలుగు ఫ్లాపులు, రిలీజావుతున్న అయిదో సినిమాకి పెద్దగా బజ్ లేదు. ఇవన్నీ సరిపోవన్నట్లు ఫ్యూచర్ సినిమాల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సాయిధరమ్ తేజ్ కి “ఇంటిలిజెంట్” సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ.. ఫ్లాప్ మాత్రం అవ్వకూడదు. ఎందుకంటే ఈ సినిమా కూడా ఫ్లాపైతే సాయిధరమ్ తేజ్ కెరీర్ కష్టాల్లోపడడం అటుంచితే భవిష్యత్ చిత్రాల బిజినెస్ మరియు ఓపెనింగ్స్ మీద సదరు సినిమాల రిజల్ట్ ప్రభావం భారీగా పడే అవకాశం పుష్కలంగా ఉంది. అందుకే ప్రభాస్, బాలకృష్ణల చేత టీజర్, సాంగ్ రిలీజ్ చేయించి సినిమాకి క్రేజ్ తీసుకురావడం కోసం నానా తంటాలు పడుతున్నారు.
అయితే.. పాపం సాయిధరమ్ తేజ్ తోపాటు వినాయక్ మరియు నిర్మాత సి.కళ్యాణ్ ఎంతలా ప్రయత్నిస్తున్నా సినిమాకి క్రేజ్ తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు “ఇంటిలిజెంట్” సినిమాని ఓవర్సీస్ లో కొన్న డిస్ట్రిబ్యూటర్ తన డబ్బులు వెనక్కి ఇవ్వమని అడుగుతుండడం పెద్ద సమస్యగా మారింది. ట్రైలర్ ఓవర్సీస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే స్థాయిలో లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. మాస్ మసాలా చిత్రాలకు ఓవర్సీస్ లో పెద్ద మార్కెట్ ఉండదు. అక్కడన్నీ ఫీల్ గుడ్ సినిమాలే. అందుకే “ఇంటిలిజెంట్” సినిమాను ఓవర్సీస్ లో కొనే నాధుడు లేకుండాపోయాడు. సో, “ఇంటిలిజెంట్”కి మిగిలింది తెలుగు రాష్ట్రాలు మాత్రమే. మరి “గాయత్రి, తొలిప్రేమ”తో పోటీగా విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకొని విజేతగా నిలుస్తుందో చూడాలి.