బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు అని వార్తలు ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా మూడో పెళ్లి అని అంటున్నారు. ఆ హీరోనే బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు గాంచిన ఆమిర్ ఖాన్ (Aamir Khan) . ఆరు పదుల వయసుకు ఒక సంవత్సరం తక్కువ ఉన్న ఆమిర్.. త్వరలో మరోసారి ఓ ఇంటివాడు అవుతున్నాడు అని చెబుతున్నారు. ఆమిర్ ఖాన్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆ మధ్య చెప్పగా..
Aamir Khan
ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఓ యువతితో ఆయన వివాహం జరగొచ్చు అనేది లేటెస్ట్ సమాచారం. ఇటీవలే ఆమెను తన కుటుంబ సభ్యులకు పరిచయం కూడా చేశాడని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలో పెళ్లికి ముహూర్తాలు పెడతారు అని చెబుతున్నారు. ఆమిర్‌ఖాన్ 1986లో రీనా దత్తాను తొలిసారి వివాహం చేసుకున్నారు. వాఇకి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో వీరిద్దరూ వివిధ కారణాల వల్ల విడిపోయారు.
ఆ తర్వాత దర్శకురాలు కిరణ్ రావ్‌తో (Kiran Rao) నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసి 2005లో రెండో వివాహం చేసుకున్నాడు ఆమిర్ ఖాన్. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక 2021లో కిరణ్ రావ్‌తో కూడా విడాకులు తీసుకున్న ఆమిర్ తనతో నటించిన ఓ యువ బాలీవుడ్ కథానాయికతో ప్రేమలో ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే ఆ పుకార్లను రెండు వర్గాలు కొట్టిపారేశాయి. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన విషయలో ఎలాంటి రూమర్లు లేవు.
ఇప్పుడు ఏమైందో ఏమో మళ్లీ ఆమిర్ పెళ్లి వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఆమిర్ సినిమాల సంగతి చూస్తే ‘సితారే జమీన్ పర్’ అనే సినిమాలో స్వీయ నిర్మాణంలో నటిస్తున్నారు. రజనీకాంత్ (Rajinikanth) – లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ‘కూలి’లో (Coolie) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది కాకుండా ‘లాహోర్ 1947’ అనే మరో సినిమాను నిర్మిస్తున్నారు.