మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం అంటూ విజయవాడలో జరిగిన మీటింగ్ కొత్త అనుమానాలను రేపింది. ఈ మీటింగ్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో అల్లు అర్జున్ ఫోటో కూడా లేకపోవడం అందరిలోనూ కొత్త అనుమానాలు రేకెత్తించింది. ఇది చిన్న మీటింగ్ అయితే కాదు.ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఆధ్వరంలో జరిగిన మీటింగ్. కాబట్టి… దీనిని అషా మాషీగా తీసుకోలేము. పైగా ఈ మీటింగ్ కు అల్లు అర్జున్ అభిమానులకి కూడా ఎంట్రీ నిరాకరించబడింది.
ఈ క్రమంలో విషయం చాలా పెద్దది గానే అందరూ భావిస్తున్నారు. అల్లు అర్జున్ ను మెగా హీరోగా పక్కన పెట్టారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. మెగా హీరో అనే ముద్ర … చిరంజీవి నీడలో ఎదిగిన హీరో అనిపించుకోవడానికి అల్లు అర్జున్ కు కూడా ఇష్టం లేదు. దీనికి కారణాలు లేకపోలేదు. అల్లు అర్జున్ తాత గారు అల్లు రామలింగయ్య … బ్యాక్ గ్రౌండ్ తోనే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు.
అంతేకాదు చిరంజీవి సక్సెస్ జర్నీలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గారి పాత్ర కూడా ఉంది. ఈ 4 ఏళ్ళలో అల్లు అర్జున్… మెగా హీరోలందరి కంటే ఎక్కువగా రాణించాడు. తెలుగులోనే కాకుండా అతనికి కేరళ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు అనే గౌరవం కూడా అల్లు అర్జున్ పై జనాల్లో ఉంది. అందుకే మెగా హీరో అనే ట్యాగ్ ను అల్లు అర్జున్ కూడా వద్దనుకుంటున్నట్టు స్పష్టమవుతుంది.