Pawan Kalyan: రెండు పాన్‌ ఇండియాల మధ్య ‘భీమ్లా నాయక్‌’ నలిగిపోతాడా?

సంక్రాంతికి ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘రాధే శ్యామ్‌’తో రెండు సినిమాల ఫైటే అని అందరూ అనుకుంటుండగా… ‘నో నో… ముందు చెప్పినట్లు నేనున్నాను’ అంటూ వచ్చేశాడు ‘భీమ్లా నాయక్‌’. దీంతో టాలీవుడ్‌ సంక్రాంతి ఫైట్‌ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో టాప్‌ మోస్ట్‌ హీరోల్లో నలుగురు సంక్రాంతి బరిలో కోడిపుంజుల్లా దూకుతున్నారు. అయితే ‘భీమ్లా నాయక్‌’ స్టెప్‌ కరెక్టేనా అనే ఓ చర్చ నడుస్తోంది. టాలీవుడ్‌లో రూపొందిన, రూపొందుతున్న భారీ, ప్రెస్టీజియస్‌ సినిమాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. ఈ సినిమా బడ్జెట్‌ ₹400 కోట్లు పైమాటే అంటున్నారు.

అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు, రాదు కూడా. మరోవైపు ‘రాధే శ్యామ్‌’కి కూడా అంతే స్థాయిలో ఫేమ్‌ ఉంది. ఈ సమయంలో ఇద్దరి మధ్యలో పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’తో రావడం ఎంత వరకు కరెక్ట్ అని అంటున్నారు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. సంక్రాంతి పోరులో తొలుత డేట్‌ ప్రకటించి సినిమాల్లో ‘భీమ్లా నాయక్‌’ ఒకటి. సినిమా చిత్రీకరణ మొదలైన కొత్తల్లోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ సంక్రాంతిగా అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాతే రంగంలోకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చింది. ఇండస్ట్రీ మంచి కోరో, ఇంకోటో కానీ… ‘సర్కారు వారి పాట’ సినిమాను ఏప్రిల్‌ 1కి వాయిదా వేశారు.

ఈ క్రమంలో ‘భీమ్లా నాయక్‌’కూడా వాయిదా పడుతుంది అనుకున్నారు. కానీ జనవరి 12 పక్కా అని మంగళవారం మరోసారి చెప్పారు. ఇప్పుడు పొంగల్‌ ఫైట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ vs ‘భీమ్లా నాయక్‌’ vs ‘రాధేశ్యామ్‌’ అయి కూర్చుంది. దీంతో థియేటర్ల విషయంలో ఇబ్బంది వస్తుందేమో అంటున్నారు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు వచ్చి థియేటర్ల విషయంలో చర్చలు, విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చిన ఐదు రోజుల తర్వాతే ‘భీమ్లా’వస్తాడు కాబట్టి సమస్య ఉండదు. కానీ ఈ సినిమా వచ్చిన రెండు రోజులకే ‘రాధేశ్యామ్‌’ వస్తుంది. దీంతో ఈ సినిమాకు థియేటర్ల విషయంలో కాస్త ఇబ్బందే. కానీ రెండు పాన్‌ ఇండియాల మధ్య పవన్‌ నలిగిపోతాడా?

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus