Brahmanandam: ‘కింగ్ ఆ ఇండియన్ సినిమా’.. బ్రహ్మానందం మాటల్లో అంత అర్థం ఉందా.. !

Ad not loaded.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటే ఇప్పటి జనరేషన్ ‘ఆచార్య’ (Acharya) ‘భోళా శంకర్’ (Bhola Shankar)..ల చిరంజీవి, ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)సక్సెస్ క్రెడిట్ రవితేజకి (Ravi Teja) వెళ్ళింది అంటూ ఏంటేంటో చెప్పుకుంటున్నారు. హైపర్ అది (Hyper Aadi) వంటి జబర్దస్త్ కమెడియన్లు చాలా టైం తీసుకుని చిరంజీవి గొప్పతనం గురించి చెబితే అది భజన అనుకుంటున్నారు. చిన్న హీరోలు చెబితే హిట్టు కోసం అనుకుంటున్నారు. కానీ చిరంజీవితో పాటు ట్రావెల్ చేసి… హీరోల్లో చిరులా… కమెడియన్స్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వ్యక్తి బ్రహ్మానందం.

Brahmanandam

ఆయన నిన్న ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గొప్పతనం గురించి చెబుతుంటే ‘ఇలాంటి వ్యక్తి కదా చిరు గొప్పతనం గురించి చెప్పాల్సింది’ అని అంతా ఫీలయ్యారు. బ్రహ్మానందం  (Brahmanandam) మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవితో నాకు 40 ఏళ్ళు అనుబంధం. ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తిని నేను. కాబట్టి ఆయన గొప్పతనం గురించి మాట్లాడే అర్హత నాకు ఉంది. అత్తిలి కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్న టైంలో నా భార్యని హాస్పిటల్ కోసమని భీమవరం తీసుకెళ్ళాను.

చెకప్ చేయించుకున్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని(పాజిటివ్ అని) తెలిసింది. తర్వాత వెంటనే ఆమెను తీసుకుని ‘ఖైదీ’ (Khaidi) సినిమాకి వెళ్లాను. అందులో ఫస్ట్ ఫైట్ మిస్ అవ్వకూడదు అని..! ఆ సినిమా చూస్తున్నప్పుడు ‘కుర్రాడెవడో భలే చేస్తున్నాడు’ అని అనుకున్నాడు. అప్పట్లో చిరంజీవి కాలు కదిపితే రెండు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లేవి. డాన్సులు, ఫైట్స్ ఇలా కూడా చేయచ్చా.? అందుకే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. కామెడీ చేస్తే మా బొచ్చెలో రాయి వేస్తాడేమో అని భయమేసింది.

ఆయనకు హార్స్ రైడింగ్ వంటివి ఎవరు నేర్పించారు. కానీ ఆయన చేశాడు. ఊరికే చిరంజీవిని పొగడడానికి నేను ఇక్కడికి రమ్మనలేదు. ఆయన ఒక అద్భుతం. అంతేకాదు ఆయన కారణజన్ముడు. ఆయన చూడని చరిత్రా? ఆయన చెప్పని చరిత్రా? ఆయన చూడండి ఏమీ లేవు. ఇప్పుడు అంతా ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా?’.. అంటున్నారు. కానీ చిరంజీవి ‘కింగ్ ఆఫ్ వరల్డ్’.

ఆయన డాన్సులకి కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నాడు” అంటూ చిరంజీవి గొప్పతనాన్ని వివరించారు. ఇదిలా ఉంటే.. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ ‘కింగ్ ఆఫ్ వరల్డ్ సినిమా’ అంటూ బ్రహ్మానందం (Brahmanandam) చేసిన కామెంట్స్ పరోక్షంగా అల్లు అర్జున్ కి (Allu Arjun) సెటైర్ వేసినట్టు ఉంది అని కొందరు భావిస్తున్నారు. ఇలా కూడా బ్రహ్మి కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

పైరసీపై గీతా ఆర్ట్స్‌ ఎందుకు ఉదాసీనంగా ఉంది.. కంప్లైంట్‌లు ఇవ్వడం లేదేం?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus