నేషనల్ సినిమా డే.. ఈ మధ్య వరకు మనకు దీని గురించి పెద్దగా తెలియదు. విదేశాల్లో అయితే ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు అని వినేవాళ్లం. అయితే ఈసారి మనవాళ్లు కూడా నేషనల్ సినిమా డేని ప్రత్యేకంగా జరుపుకోవాలని అనుకున్నారు. ఆ రోజు స్పెషలేంటో మీకు తెలుసుగా? మల్టీప్లెక్స్‌ల్లో ఆ రోజున టికెట్ రేటను బాగా తగ్గిస్తారు. దీంతో థియేటర్లకు జనాలు బారులు తీరుతుంటారు. అలాంటి స్పెషల్ డే మన దగ్గర కూడా వస్తుంది అంటే వావ్ అనుకున్నారు.
అయితే దానిని కూడా వాయిదా వేస్తున్నారు. అదేంటి సినిమా డేని వాయిదా వేయడం ఏంటి? అనుకుంటున్నారా? మీరు విన్నది కరెక్టే ఆ రోజును కూడా వాయిదే వేస్తున్నారు. ముందుగా చెప్పినట్లు సెప్టెంబరు 16న జరగాల్సిన సినిమా డేను సెప్టెంబరు 23కు పంపించారట. దీంతో 16న తక్కువ రేటుకు సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా ‘బ్రహ్మాస్త్ర’ ఉందనే టాక్ నడుస్తోంది.
చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో మంచి వసూళ్లు అందుకుంటున్న సినిమాగా ‘బ్రహ్మాస్త్ర’ నిలుస్తోంది. ఇలాంటి సమయంలో 16వ తేదీన తక్కువ రేటుకు ‘బ్రహ్మాస్త్ర’ అంటే నిర్మాతలకు లాస్ వస్తుంది అని అనుకుని, సినిమా డేను వాయిదా వేశారు అని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం చూసుకొని 23న విడుదలవుతున్న కొత్త సినిమాల సంగతి పక్కన పెట్టేశారని కూడా విమర్శలు వస్తున్నాయి.
ఆ రోజున అంటే 23న ‘అల్లూరి’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘కృష్ణ వ్రిందా విహారి’ దుల్కర్ సల్మాన్ ‘చుప్’ ఉన్నాయి. మరి వీటికి నేషనల్ సినిమా డే ఎఫెక్ట్ ఉండదా అంటే ఉంటుంది అనే చెప్పాలి. కానీ వీటికి ఓపెనింగ్స్ బాగుంటాయి అనేది ఓ పాజిటివ్ ఎలిమెంట్. తక్కువ రేటు కదా అని ఎక్కువమంది చూసి.. మౌత్ టాక్‌తో ఆ తర్వాతి రోజులు సినిమాకు వసూళ్లు బాగుంటే హ్యాపీనే కదా.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!