పేదింటి అమ్మాయి, డబ్బున్న అబ్బాయి… ధనవంతురాలైన అమ్మాయి, పేదవాడైన అబ్బాయి ప్రేమ కథల్లో ఈ రెండు రకాల కాన్సెప్ట్‌లు ఎక్కువగా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ విషయలో ఒకటి సుఖాంతం, రెండోది విషాదాంతం ఉంటాయి. అయితే కరోనా ముందు సమయంలో నలుపు రంగు అబ్బాయి, తెలుపు రంగు అమ్మాయి అనే కాన్సెప్ట్‌తో వచ్చి హిట్ కొట్టారు, ఆ తర్వాత జాతీయ అవార్డు కొట్టేశారు. ఆ సినిమానే ‘కలర్ ఫొటో’. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటున్నారా?
కొత్తగా వచ్చిన ‘బేబీ’ టీజర్ చూసి అందరూ ఆ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. స్కూలు ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. అందులో వైష్ణవి చైతన్య కాస్త నల్లగా కనిపిస్తోంది. ఆనంద్ తెల్లగా కనిపిస్తున్నాడు. దాంతోపాటు ఈ ప్రేమలో ఉన్న కాన్‌ప్లిక్ట్ కూడా ‘కలర్ ఫొటో’కి దగ్గరగా ఉంటుంది అంటున్నారు.
క్లయిమాక్స్ విషయంలో సిమిలారిటీ ఉంటుంది అంటున్నారు. అంటే ఇందులోనూ ఓ ప్రధాన పాత్ర చనిపోతుంట. ఈ మొత్తం విషయాలను కలుపుకుని ఈ సినిమా ఏమన్నా ‘కలర్ ఫొటో’కి రివర్సా అంటున్నారు. అంటే ‘కలర్ ఫొటో’ సినిమాలో హీరో పాత్ర నలుపుగా ఉంటుంది. హీరోయిన్ పాత్ర వైట్‌గా ఉంటుంది. ఇప్పుడు ‘బేబీ’ సినిమాలో సీన్ రివర్స్ అన్నమాట. అంటే హీరో తెల్లగా ఉంటే.. హీరోయిన్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలోనే మార్పులు ఉంటాయట.
అందులో హీరోయిన్ అన్నయ్య అడ్డంకి అయితే.. ఇందులో ఫ్రెండ్ లాంటి పాత్ర అడ్డుపడుతుందట. అయితే ఇవన్నీ ట్రైలర్ చూసి చెప్పిన మాటలే.. సినిమా వస్తే కానీ అసలు విషయం తెలియదు. ఆనంద్ దేవరకొండ హీరో కావడంతో.. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ, రష్మిక లాంటి స్టార్‌లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరోవైపు మారుతి టీమ్ నుండి వస్తున్న సినిమా కావడంతో మరికొంతమంది స్టార్లు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇవి సినిమా ఓపెనింగ్స్‌కి కచ్చితంగా పనికొస్తాయి అనే చెప్పాలి.