Dil Raju: థాంక్యూ ఫ్లాపైనా దిల్ రాజుకు నష్టాలు రావా?

  • July 23, 2022 / 05:36 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు బ్యానర్ లో ఏదైనా సినిమా తెరకెక్కితే ఆ సినిమా హిట్ అని కొన్నేళ్ల క్రితం వరకు అందరూ భావించేవారు. అయితే గత కొన్ని సంవత్సరాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలలో హిట్టవుతున్న సినిమాల కంటే ఫ్లాప్ అవుతున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్3 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని దిల్ రాజు చెప్పుకున్నా కొన్ని ఏరియాలలో ఈ సినిమా నష్టాలను మిగిల్చిందనే సంగతి తెలిసిందే.

జోష్ సినిమాతో దిల్ రాజు నాగచైతన్యను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాసువర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదనే సంగతి తెలిసిందే. థాంక్యూ సినిమాతో అయినా దిల్ రాజు నాగచైతన్యకు హిట్ ఇస్తారని అందరూ అనుకుంటే ఈ సినిమా కూడా భిన్నమైన ఫలితాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. మరోవైపు థాంక్యూ ఫ్లాప్ అని దిల్ రాజుకు ముందే తెలుసని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మొదట దిల్ రాజు థాంక్యూ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్రయత్నించారని అయితే చైతన్య ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి ఆ విషయంలో వెనక్కు తగ్గారని సమాచారం అందుతోంది. థాంక్యూ తొలిరోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని బోగట్టా. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. చైతూ కెరీర్ కు ఈ సినిమా వల్ల నష్టమే తప్ప లాభం లేదని తెలుస్తోంది.

అయితే దిల్ రాజు మాత్రం ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించారని అందువల్ల ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నా దిల్ రాజుకు మాత్రం నష్టాలు వచ్చే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి హిట్టిచ్చిన విక్రమ్ కుమార్ అఖిల్ తో తెరకెక్కించిన హలో, చైతన్యతో తెరకెక్కించిన థాంక్యూ ఫ్లాప్ కావడం గమనార్హం.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus