‘దేవర’ ‘(Devara) సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది అని వార్త రాగానే.. ఇటు తారక్ (Jr NTR) అభిమానులు, అటు జాన్వీ లాంగ్ డిస్టెన్స్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆమె ఎంత అందంగా ఉంటుందో.. అంత మంచి నటీమణి కూడా కావడమే ఆ ఆనందానికి కారణం. మరి సినిమా చూశాక ఆ ఆనందం కనిపించిందా? ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారా? అంటే లేదనే చెప్పాలి. ఆ మాటకొస్తే ఆమెకు అంతెందుకు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
Janhvi Kapoor
‘దేవర’ సినిమాకు సంబంధించి ఎవరెంత తీసుకున్నారు? ఎంతిచ్చారు అనేది పక్కాగా చెప్పలేం లేనీ సినిమా కోసం జాన్వీకి సుమారు రూ. 5 కోట్లు ఇచ్చి ఉంటారని టాలీవుడ్లో సమాచారం. ఆ లెక్కన సినిమాలో ఆమెకు ఒక్కో సీన్ కోసం ఒక్కో కోటి ఇచ్చారా అంటూ జోకులేస్తున్నారు. ఎందుకంటే జాన్వీకి సినిమాలో సన్నివేశాలు చాలా తక్కువ. పోనీ తారక్‌తోనే ఆ సీన్స్ ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో జాన్వీకి ఎందుకంత ఇచ్చారో అంటున్నారు.
రెండు పార్టులకు కలిపి రూ. 5 కోట్లు ఇచ్చారేమో అనే డౌట్ కూడా ఉండొచ్చు. అయితే ఇది ఒక్క పార్టుకే అని టీమ్ నుండి అందుతున్న సమాచారం. అయితే రెండో పార్టులో ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది అని చెబుతున్నారు. అయితే పిరికివాడైన హీరోను మార్చే సీన్స్ ఉంటే జాన్వీది బలమైన పాత్ర అని చెప్పొచ్చు. కానీ ఆ పాత్ర ట్రాన్సాఫామేషన్ ఇప్పటికే అయిపోయింది. కాబట్టి ఉంటే రెండో పార్టులో పాటలు, అందాల ఆరబోతలే ఉంటాయి.
కాబట్టి తొలి పార్టులో మిస్ అయిన కొన్ని ప్రేమ సన్నివేశాలు, పాటలు రెండో పార్టులో చూపించే ప్రయత్నం చేస్తారు కొరటాల శివ (Koratala Siva) . కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఇచ్చారు అనిపించినా.. రెండో పార్టు చూశాక బాగానే ఇచ్చారులే అనిపించొచ్చు. ఒకవేళ రెండో పార్టులోనూ సరైన సీన్స్ లేకపోతే బంగారు పాత్రను చిల్లర కోసం వాడినట్లు అయిపోతుంది అని చెప్పాలి.