కొన్నిసార్లు అతి మంచితనం వల్ల కూడా లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను (Jr NTR) చూస్తే అతి మంచితనం వల్ల ఆయన నష్టపోతున్నారేమో అనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదా రాజకీయాలకు సంబంధించి మరేదైనా నిర్ణయం తీసుకుంటారో అనేది ఆయన వ్యక్తిగత విషయం అనే సంగతి తెలిసిందే. గత పదేళ్లలో మాత్రం తారక్ రాజకీయాలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి కామెంట్లు చేయలేదు.
ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. అయితే 2024 ఎన్నికలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ గా జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు జూనియర్ ఎన్టీఆర్ పై పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా కామెంట్లు చేయడం ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం అయితే చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ పోస్టులు పెట్టిన వాళ్ల విషయంలో ఫ్యాన్స్ సైతం ఒకింత ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఆయా పార్టీల నేతలు చివరకు ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ వేడుకునే వరకు పరిస్థితి అయితే వచ్చింది. మరోవైపు మరికొన్ని రోజుల్లో ఏపీ రాజకీయ ఫలితాలు వెలువడనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పబ్లిక్ ప్లేసెస్ లో కనిపించిన సమయంలో కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహంతో సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నారు.
అయితే తారక్ అన్ని ప్రశ్నలకు జవాబులు దొరికేలా వీడియో రూపంలో కానీ సోషల్ మీడియా పోస్ట్ రూపంలో కానీ రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ క్లారిటీ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తన ఇష్టానికి అనుగుణంగా ఏ రంగంలోకి వచ్చినా సక్సెస్ కావాలని అభిమానులు భావిస్తున్నారు.