ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. చాలా రకాల ఊహాగానాలు, చర్చలు తర్వాత ఈ సినిమా వార్త బయటికొచ్చింది. అలా వార్త వచ్చింది మొదలు ఏదో ఒక పుకారు వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అలా కనిపిస్తాడు, ఇలా ఉంటాడు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అందులో ఎక్కువగా వినిపించింది ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతాడని. అయితే ఇప్పుడు వేరే మాట వినిపిస్తోంది. ఇది కొంచెం ఇంట్రస్టింగ్‌గా ఉంది.
అల్లు అర్జున్ 21వ సినిమాను కొరటాల డైరక్ట్ చేయాల్సి ఉంది. అయితే వివిధ చర్చల తర్వాత కొరటాల ఆ సినిమా వదులుకొని ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేశాడు. అయితే బన్నీకి చెప్పిన కథతోనే ఎన్టీఆర్ సినిమా తీస్తాడని అన్నారు. AA21లో అల్లు అర్జున రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే అదే కథలో ఎన్టీఆర్ అంటే… ఎన్టీఆర్ పొటికల్ లుక్ తప్పనిసరి అనుకున్నారు. అయితే ఇప్పుడది విప్లవ నాయకుడు పాత్రగా మారుతోందట.
అవును కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ విప్లవ నాయకుడి అవతారంలో కనిపిస్తాడట. దీనికి తగ్గట్టుగా కొరటాల కథను సిద్ధం చేస్తున్నారట. అయితే ఇలా ఎందుకు మార్చారు అంటే రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి ఇప్పుడు రాజకీయ వాసన తనకు అంటకూడదని ఎన్టీఆర్ అనుకోవడం. రాజకీయ నేపథ్యంలో ఏ సినిమా చేసినా ఓ పార్టీకి ముడివేసేస్తారు జనాలు. ఆ ఇబ్బంది లేకుండానే రాజకీయ నేపథ్య కథ ఆలోచన ఎన్టీఆర్ విరమించుకున్నాడని టాక్.