Krithi Shetty: వైష్ణవ్ ఫెయిల్.. కృతి పాసవుతారా?

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. అటు వైష్ణవ్ కు ఇటు కృతిశెట్టికి తొలి ప్రయత్నంలోనే భారీ విజయం దక్కింది. ఉప్పెన మూవీతో వీళ్లిద్దరూ ఓవర్ నైట్ స్టార్స్ గా గుర్తింపును, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఉప్పెన సక్సెస్ వల్ల వైష్ణవ్, కృతిశెట్టి భవిష్యత్తు సినిమాలపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలం ఈ నెల 8వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో వైష్ణవ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేదు. రెండో సినిమాతో వైష్ణవ్ తేజ్ ఖాతాలో ఫ్లాప్ చేరిందనే చెప్పాలి. అయితే వైష్ణవ్ కు దక్కని సక్సెస్ కృతిశెట్టికి దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది.

డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు కృతిశెట్టి చేతిలో బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, రామ్ లింగుస్వామి కాంబో మూవీ, ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాలు ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్ తో కృతిశెట్టి తన సక్సెస్ ను కొనసాగిస్తారేమో చూడాల్సి ఉంది. కృతిశెట్టి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కృతిశెట్టి నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడం గమనార్హం.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus