Niharika: తన అన్న ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో నిహారిక పాత్ర పెద్దదే..!

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్…ల ఎంగేజ్మెంట్ న్యూస్ గత 4,5 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో వీళ్ళు డేటింగ్ లో ఉన్నట్టు ఎన్నో వార్తలు వచ్చేవి. కానీ అవి అవాస్తవాలని వీళ్ళు తేల్చి చెప్పేశారు. కానీ ఆ ప్రచారం ఆగలేదు.కొన్నాళ్ల తర్వాత వీటికి స్పందించడం కూడా మానేశారు. అయితే ఫైనల్ గా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు.

జూన్ 9న లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అనఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉండగా.. వీళ్ళ పెళ్లి వెనుక ఓ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు శ్రీనువైట్ల గురించి, అలాగే జ్యోతిష్యుడి హస్తం ఉన్నట్టు వేణు స్వామి గురించి జనాలు ఎక్కువగా చెప్పుకున్నారు. కానీ వరుణ్ – లావణ్య ల మధ్య ప్రేమ చిగురించడం వెనుక నిహారిక హస్తం ఎక్కువగా ఉందట.

వాస్తవానికి లావణ్య త్రిపాఠి… వరుణ్ తేజ్ కంటే ముందు (Niharika) నిహారికకి ఫ్రెండ్ అట. నిహారిక – లావణ్య త్రిపాఠి లకు జిమ్ లో పరిచయమైంది. తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటినుండి లావణ్య త్రిపాఠి నాగ బాబు ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేది.అంతేకాదు మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా లావణ్య త్రిపాఠిని ఆహ్వానించేది నిహారిక. అలా వరుణ్ కూడా లావణ్యకి పరిచయమయ్యాడు.తర్వాత తన మిస్టర్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికవ్వడంలో కీలక పాత్ర పోషించాడు.

అలాగే అంతరిక్షం సినిమాలో కూడా వీళ్ళు జంటగా నటించారు. తర్వాత వీళ్ళ మధ్య ప్రేమ చిగురించడం జరిగింది. ఇంట్లో వాళ్ళను ఒప్పించడానికి లావణ్య , వరుణ్ లు ఎక్కువగా టైం తీసుకున్నారట. వరుణ్ తేజ్ తరఫున నిహారిక మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి ఒప్పించింది. ఇలా తన అన్న ప్రేమ, పెళ్లి విషయాల్లో మెగా డాటర్ నిహారిక పోషించిన పాత్ర పెద్దదే అని ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus