వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. అంటే 11 నెలల ముందే మాట్లాడుకుంటున్నాం. ఇంత ఎర్లీగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే… మన సినిమా నిర్మాతలు, హీరోలు చెబుతున్న మాటలు. వాటిని అనుసరించి వస్తున్న పుకార్లే కారణం. ఇప్పటికే ఆరు సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి అంటుంటే.. ఇప్పుడు మరో సినిమా కూడా ఈ వరుసలోకి వచ్చింది అంటున్నారు. అయితే ఆఖరికి ఏవి రేసులో ఉంటాయి అనేది మనం ఇప్పుడే చెప్పలేం అనుకోండి.
తాజాగా సంక్రాంతి రేసులోకి వచ్చిన సినిమా నిజంగా వస్తే… కచ్చితంగా బాక్సాఫీసు దగ్గర మెగా క్లాష్ చూస్తాం. అదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు పొంగల్ ఫైట్‌కి రెడీ అవుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ అంటున్నారు కాబట్టి. రీసెంట్ ఆ సినిమా టీమ్ ప్రాజెక్ట్ అప్‌డేట్ ఇచ్చింది. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వస్తారని, లేదంటే ఎక్కువ డేట్స్ ఇస్తారనేది వారి ఆలోచన. ఆ లెక్కన మూడేసి నెలల గ్యాప్‌లో పవన్ (Pawan Kalyan) మూడు సినిమాలు తీసుకొచ్చే ఆలోచన జరగుతోందట.
అంటే అక్టోబరు ఆఖరున ‘ఓజీ’ సినిమా వస్తుందని ఇప్పటికే చెప్పేశారు. ఆ తర్వాత సంక్రాంతికి ‘హరి హర వీరమల్లు’ సినిమా తీసుకొస్తారట. ఆ తర్వాత సమ్మర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రావొచ్చు అంటున్నారు. ఆ లెక్కన ముగ్గుల పండక్కి చిరంజీవి ‘విశ్వంభర’ వస్తుంది. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ కూడా తెస్తారంటే మెగా క్లాష్ తప్పనిసరి అనేగా. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే… అసలు సినిమా ఆ టైమ్‌కి పూర్తవుతుందా? అని. చాలా నెలలుగా సినిమా ఎక్కడ వేసిన గొంగలి అనేలానే ఉంది.
పై రెండు సినిమాలు కాకుండా నాగార్జున సినిమా, ‘జై హనుమాన్’, ‘శతమానం భవతి 2’ సినిమాలు సంక్రాంతి రేసులో ఉంటాయి అంటున్నారు. ఇక ప్రభాస్ ‘రాజా సాబ్’ కూడా అప్పుడే రావొచ్చని నిర్మాత ఇటీవల చూచాయగా చెప్పారు. ఇంకా మరికొన్ని అప్పటికి రెడీ అవుతాయి అంటున్నారు కూడా. చూడాలి పొంగల్ ఫైట్ ఎలా ఉండబోతోందో?