ఎక్కువ టైంలేకో ఏమో.. కానీ ఈ మధ్య మన తెలుగు దర్శకులు హాలీవుడ్ లేదా కొరియన్ సినిమాల నుండీ కథలు లేపేస్తున్నారు. దీనిగురించి ఆరాతీస్తే ‘ఆ సినిమా కథ వేరు.. మా సినిమా కథ వేరు’.. జస్ట్ లైన్ తీసుకున్నాం అంతే అంటూ ‘కింగ్’ సినిమాలో బ్రహ్మానందం మాదిరి ఓ కామెంట్ పడేసి ఎస్కేప్ అయిపోతున్నారు. అయితే ఒకప్పుడు సోషల్ మీడియా అంత పాపులర్ అవ్వలేదు.. కానీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ బోలెడు వచ్చేసాయి. కాపీ అని తెలిస్తే వెంటనే ట్రోల్స్ చేస్తున్నారు .. విమర్శలు చాలా పీక్స్ లో ఉంటున్నాయి. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ ‘సాహో’ చిత్రాల్ని ఇందుకు ఉదాహరణకు చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ (వర్కింగ్ టైటిల్) కథ కూడా ఓ హాలీవుడ్ సినిమా కాపీ అని తెలుస్తుంది. మొదట ఈ కథని డిఫరెంట్ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించాలి అనుకున్నాడట. కానీ ఎందుకో అది కుదర్లేదు. దీంతో ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఆ కథని బాగా డెవలప్ చేసుకుని యూవీ క్రియేషన్స్ మరియు ప్రభాస్ కు వినిపించాడు. యంగ్ డైరెక్టర్ కదా.. స్క్రిప్ట్ ఇప్పటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా రాసుకున్నాడు అని నమ్మి ప్రభాస్ అండ్ యూవీ వారు ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది.