Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌.. ఆ డేట్‌ మీద చాలా సినిమాల కన్ను..!

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  సినిమా పనులు ఎంతవరకు వచ్చాయి, రీషూట్ల సంగతేంటి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ సంగతేంటి అనే విషయాలు తెలియవు కానీ.. సినిమా టీమ్‌ ఏ సందర్భం వచ్చినా ‘క్రిస్మస్‌కి వచ్చేస్తాం’ అనే మాట మాత్రం చెబుతున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు అసలు ఆ టైమ్‌లో అలాంటి అవకాశం ఉందా? అసలు అప్పుడు వస్తాం అని ఫిక్స్‌ అయితే రిలీజ్‌ డేట్‌ ఎందుకు అనౌన్స్‌ చేయడం లేదు.

Game Changer

గత కొన్ని రోజులుగా ఈ విషయం గురించి రామ్‌చరణ్‌ (Ram Charan) అభిమానుల్లో చర్చ నడుస్తోంది. డిసెంబరులో విడుదల చేయడానికి చాలా సినిమాలు వరుస కట్టే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఆఖరి నెల పూర్తి స్థాయిలో సినిమాలకు డ్రై మంత్‌ అనేవారు. ఇప్పుడు ఆ నెల కోసమే పెద్ద పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’కి సింగిల్‌ డేట్‌ దొరుకుతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా చెప్పకపోయినా.. డిసెంబర్ 20న తీసుకొస్తారు అని ఓ సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. డిసెంబర్ 6 ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) వస్తుంది అంటున్నారు కాబట్టి అక్కడికి సుమారు రెండు వారాలకు వచ్చేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. అయితే క్రిస్మన్‌ రేసులో ఆమిర్‌ ఖాన్ (Aamir Khan) ‘సితారే జమీన్ పర్’, వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) ‘బేబీ జాన్‌’ లాంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఆమిర్‌ ఇప్పుడు పోటీ నుండి తప్పుకున్నారు.

దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’కి ఒక అడ్డు అయితే తొలగింది. మరి మిగిలిన సినిమా అలానే ఉంటుందా? కొత్త సినిమాలు ఏవీ ఆ డేట్‌కి రాకుండా ఉంటాయా అనేది చూడాలి. ఒకవేళ వస్తే పాన్‌ ఇండియా రిలీజ్‌ అంత సులభంగా ఉండదు. కాబట్టి వీలైనంత త్వరగా దిల్‌ రాజు (Dil Raju)  సినిమా రిలీజ్‌ డేట్ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేయాలి అని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

తోటి పిల్లల టిఫిన్స్‌ బాక్స్‌లు తినేసిన తమన్‌.. చిన్ననాటి అల్లర్లు ఎన్నో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus