Samantha: ‘సిటాడెల్‌’ రీమేక్‌ విషయంలో ‘బెడ్‌ రూమ్‌’ డిస్కషన్‌.. క్లారిటీ వచ్చినట్లేనా?

ఓ భాషలో వచ్చిన సినిమా.. మళ్లీ చేస్తున్నారంటే.. అదేనండీ రీమేక్‌ చేస్తున్నారంటే చాలా అంచనాలు ఉంటాయి. మాతృకలో ఏం చేశారు, ఎలా చేశారు, ఎలా సన్నివేశాలను రక్తి కట్టించారు అంటూ లెక్కలేసి.. ఇప్పుడు రీమేక్‌లో అలానే చేయాలి, కుదిరితే అంతకంటే ఎక్కువ చేయాలి అని అనుకుంటుంటారు. ఇది సగటు ప్రేక్షకుడి ఆలోచన. అభిమానులు అయితే ఇంకా ఎక్కువగా లెక్కలేస్తారు. అలా ఇప్పుడు లెక్కలేస్తున్న అభిమానులు సమంత ఫ్యాన్స్ అయితే.. ఆ లెక్కలేసే విషయం ‘సిటాడెల్‌’ రీమేక్‌.

అంతర్జాతీయంగా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకున్న సిరీస్‌ ‘సిటాడెల్‌’. ఇందులో ప్రియాంక చోప్రా అదరగొట్టింది. యాక్షన్‌, రొమాన్స్‌ను బాగా మిక్స్‌ చేసి తెరకెక్కించిన సిరీస్‌ ఇది. హాలీవుడ్ ‘సిటాడెల్’లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించారు. ఇప్పుడు మన ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు. రాజ్ & డీకే ఇక్కడ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఒరిజినల్‌లో ఉన్న బెడ్‌ రూమ్‌ సీన్స్‌ ఇక్కడ ఉంటాయా అనేదే ప్రశ్న.

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన హాలీవుడ్‌ ‘సిటాడెల్‌’లో బెడ్ రూమ్ సీన్స్ చాలానే ఉన్నాయి. లిప్‌ లాక్‌లు బోలెడు కనిపిస్తాయి. మరి ఇండియన్‌ ‘సిటాడెల్‌’లో సమంత ఆ సీన్స్‌ చేసిందా అనే ప్రశ్న సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే వీటికి సుమారు క్లారిటీ వచ్చేసింది. ‘సిటాడెల్‌’ వెబ్ సిరీస్‌లో బెడ్ రూమ్ సీన్స్‌కు చోటు లేదని ఆమె టీమ్‌ చెప్పేసింది అంటున్నారు. ఈ సీన్స్‌ ఉండవు అన్నాకనే సమంత ఓకే చేసిందని కూడా అంటున్నారు. ప్రియాంక చోప్రా ‘సిటాడెల్‌’ తెలుగులోనూ, ఆ మాటకొస్తే మన దేశంలోని ముఖ్యమైన భాషల్లో విడుదలైంది కదా.

మళ్లీ ఇంకొకటి ఎందుకు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. దీనికి సమాధానంగా ఈ సిరీస్‌ రీమేక్‌ కాదని తేల్చేశారు ఆమె సన్నిహితులు. ‘సిటాడెల్‌’ సిరీస్‌ను ప్రాంతానికి తగినట్లుగా మార్పులు చేసి సిద్ధం చేస్తున్నారట. కాబట్టి ఒరిజినల్‌, రీమేక్ అనే లెక్క ఏదీ ఉండదు అని చెబుతున్నారు. (Samantha) సమంత సినిమాల సంగతి చూస్తే… ‘శాకుంతలం’ ఇలా వచ్చి అలా వెళ్లిపోగా.. ‘ఖుషి’ సినిమా షూటింగ్‌ దశలోఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ హీరో.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus