Dhanush, Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల కొత్త సినిమా అలాంటిదేనట!

మనసును మెలితిప్పే కథలు ఎంత బాగా తీస్తారో, సమాజంలో కష్టాల్ని అంతే బాగా చూపిస్తుంటారు శేఖర్‌ కమ్ముల. ఆయన కెరీర్‌లో ది బెస్ట్‌ అనిపించుకునే సినిమాల్లో ‘లీడర్‌’ను తొలి స్థానాల్లో పెట్టొచ్చు కూడా. అయితే ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల నుండి అలాంటి సినిమాలు రాలేదు. వరుసగా ప్రేమకథలు, యూత్ బేస్డ్‌ సినిమాలు చేసుకుంటూ వచ్చారాయన. అయితే ఇప్పుడు మరోసారి పొలిటికల్‌ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు.

ధనుష్‌ – శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో ఓ మల్టీ లింగ్వుల్‌ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తారు. ఈ సినిమాకు సంబంధించి ఇంతకుమించి అధికారిక సమాచారం ఏదీ లేదు. అయితే సినిమాలో రాజకీయ ఛాయలు కచ్చితంగా కనిపిస్తాయనే పుకార్లు మాత్రం వినిపిస్తున్నాయి. శేఖర్‌ కమ్ముల సినిమాలోయ ధనుష్‌ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడనేది తాజా ఖబర్‌.

సమాజంలో సీరియస్‌ ఇష్యూను ఈ సినిమాలో చర్చిస్తారని గతంలోనే పుకార్లు వచ్చాయి. విద్యా వ్యవస్థలో లోపాల గురించి చర్చిస్తారని అన్నారు. అయితే ఆ చర్చ ధనుష్‌ ఆధ్వర్యంలో నడుస్తుందట. ఆ తర్వాత ధనుష్‌ సీఎం అవుతాడని అంటున్నారు. ఇందులో నిజానిజాలెంతో త్వరలో తేలిపోతుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus