Sushmita Sen: విశ్వసుందరి అతనితో ఇందుకే విడిపోయిందా!

సహజీవనం నుండి విడిపోతున్నాం, స్నేహితులుగా ఉండిపోతాం అంటూ ఆ మధ్య సుస్మితా సేన్‌, రోహ్మన్‌ షాల్ ప్రకటించారు. అదేంటి ఎందుకు విడిపోతున్నారు? దీనిపై వీళ్లిద్దరూ ఏదైనా దాస్తున్నారా? అంటూ చర్చలు అయితే ఆ మధ్య సాగాయి. కానీ ఎక్కడా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే తాజాగా సుస్మితా సేన్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో కాసేపు మాట్లాడింది. తన గురించి, తాజా పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. అందులో కొన్ని మాటలు ఆమె బ్రేకప్‌కు సంబంధించి ఉన్నాయి. దీంతో ఇప్పుడా మాటలు వైరల్‌గా మారాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో సుస్మితా మాట్లాడుతుండగా ఓ నెటిజన్‌ గౌరవం గురించి టాపిక్ తీసుకొచ్చాడు. దానికి ఆమె పెద్ద సమాధానమే ఇచ్చింది. అందులో ఆమె చెప్పిన మాటలు, రీసెంట్‌ రిలేషన్‌షిప్‌ బ్రేకింగ్‌ గురించేనా అని అనిపిస్తోంది. ‘మీ ఉద్దేశం ప్రకారం గౌరవం అంటే ఏమిటి?’’ అని ఓ నెటిజన్‌ అడిగాడు. దానికి సుస్మిత మాట్లాడుతూ… నేను జీవితంలో గౌరవానికి అధిక ప్రాధాన్యతిస్తాను. ఒకరకంగా చెప్పాలంటే ప్రేమ కంటే గౌరవమే మిన్న. గౌరవం లేని చోట ప్రేమకు స్థానం లేదు.

ప్రేమ పుడుతుంది, పోతుంది కానీ గౌరవం ఉంటే ప్రేమ రెండోసారి చిగురించడానికి అవకాశం ఉంటుంది’’ అని చెప్పింది సుస్మితా సేన్‌. ఇప్పుడు ఈ మాటలే వైరల్‌గా మారాయి. సుస్మిత… జనరల్‌గా ఈ మాటలు చెప్పిందా? లేక తన జీవితంలోని విషయాలను వివరించిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రోహ్మన్‌తో సహజీవనంలో ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం వల్లే ఆమె విడిపోయిందా అని లెక్కలేస్తున్నారు. దీనిపై మరో సందర్భంలో సుస్మిత ఏమైనా సమాధానం చెబుతుందేమో చూడాలి.

మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధామిస్తూ… ఒంటరిగా ఫీల్‌ అయితే స్ఫూర్తిదాయక వ్యక్తుల నిజ జీవిత కథలు వింటుంటానని చెప్పింది సుస్మిత. అలా ప్రేరణ పొందే మళ్లీ సాధారణ జీవితంలోకి రాగలుగుతానని కూడా చెప్పింది. ఇక, సుస్మిత, రోహ్మన్‌ గురించి చూస్తే… సుస్మిత కంటే రోహ్మన్‌ 15 సంవత్సరాలు చిన్నవాడు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఈ జంట.. డేటింగ్‌లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.అంతే ఆశ్చర్యంగా విడిపోతున్నట్లూ ప్రకటించారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus