ఇండస్ట్రీలో నిర్మాతలు అందరూ స్నేహితులే.. ఒకరి కోసం ఒకరు మాట్లాడతారు, ఒకరికి కష్టం వస్తోంది అంటే.. మిగిలిన వాళ్లు రియాక్ట్ అవుతారు. అయితే ఇవేవీ నేరుగా చెప్పరు.. నేరుగా మాట్లాడరు కూడా. అన్యాపదేశంగానో, తమ ఆలోచనగానో చెబుతూ ఉంటారు. ఇప్పుడు ‘సంక్రాంతి వార్’ విషయంలోనూ అదే జరుగుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ విషయం మీదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సంక్రాంతి సీజన్‌లో సినిమాల విడుదల గురించి ఘాటుగా స్పందించారు.
ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ‘రజనీకాంత్ సినిమా అయితేనేం.. సంక్రాంతికి మన తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటూ కామెంట్ చేశారు. దీనికి అప్పుడు చాలామంది నిర్మాతలు అవును, అవును.. అంటూ తలూపారు. కొందరైతే బహిరంగంగానే స్పందించారు. అయితే దిల్ రాజుకు వ్యతిరేకంగా అప్పుడెవరూ మాట్లాడలేదు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. సేమ్ సంక్రాంతి సీజన్.. సేమ్ సిట్యువేషన్. అయితే ఇప్పుడు ఆ తమిళ సినిమాకు నిర్మాత దిల్ రాజు.
దీంతో అన్ని సినిమాలు ఒకటే.. ఏది రిలీజ్ చేస్తేనేం అని అంటున్నారు. ఈ మాటల్ని దిల్ రాజు నేరుగా అనకపోయినా.. ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతలు ఇదే మాట అంటున్నారు. మొన్నీమధ్య అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘తమిళ సినిమా సంక్రాంతికి రాకుండా ఆపాలని నిర్మాతల మండలి అంటోంది.. కానీ ఇది ఆచరణలో సాధ్యం కాదు’’ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు అశ్వనీదత్ కూడా ఇదే రీతిలో మాట్లాడారు. తమిళ సినిమా అయితేనేం.. సంక్రాంతికి రాకూడదా అని అశ్వనీదత్ ప్రశ్నించారు.
తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు కాబట్టి.. ఇది తెలుగు సినిమాలతో రావొచ్చు అని అన్నారు. అయితే ఇప్పుడు స్పందించిన ఇద్దరి వెనుక ఎవరున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు అని నెటిజన్లు అంటున్నారు. నిర్మాతల మండలి చెప్పిన ‘సంక్రాంతికి తెలుగు సినిమాలకే ప్రాధాన్యం’ అనే మాటను సీనియర్ నిర్మాతలే నో అంటున్నారు. ఇదంతా చూస్తుంటే తెలుగు వర్సెస్ తెలుగు నిర్మాతలు అనేలా కాకుండా… నిర్మాతల మండలి వర్సెస్ తెలుగు సీనియర్ నిర్మాతలు అనేలా మారింది. మరి దీని వెనుక ఎవరు కారణమో జనాలకే తెలియాలి.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!