Vijay: విజయ్‌ ఓవైపు గ్యాప్‌ అంటున్నాడు.. స్టార్‌ డైరక్టర్‌కి ఓకే అన్నాడని చెబుతున్నారు… ఏది నిజం?

దళపతి విజయ్‌ గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో, కోడంబాక్కం వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదే అతని రాజకీయ ఎంట్రీ. చాలా ఏళ్లుగా విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి చర్చ నడుస్తున్నా.. ఈ సారి మాత్రం బలంగా వినిపిస్తోంది. అంతేకాదు ఈసారి విజయ్‌ ఏకంగా పాదయాత్ర చేస్తాడు అని కూడా అంటున్నారు. దీని కోసం గోపీచంద్‌ మలినేని సినిమా కూడా వద్దనుకున్నాడు అని చెబుతున్నారు.

అయితే తాజాగా బయటకు వచ్చిన మరో వార్త ఈ మొత్తం చర్చను పక్కకు పెట్టేలా కనిపిస్తోంది. అదే శంకర్‌ సినిమా. ‘నన్బన్‌’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో హిట్‌ జోడీగా నిలిచారు విజయ్‌, శంకర్‌. ఇప్పుడు వీరిద్దరూ మరో సినిమా కోసం పని చేయనున్నట్టు తమిళ సినిమా వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్‌ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ విన్నారని, బాగా నచ్చడంతో ఓకే చేసేశారని కూడా చెబుతున్నారు.

అన్నీ కుదిరితే త్వరలోనే సినిమా షూటింగ్‌ మొదలవుతుంది అని చెబుతున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది అని సమాచారం. ఇదే నిజమైతే దాదాపు 11 ఏళ్ల తరవాత వీరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ వార్త వల్ల రెండు విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి సినిమాలకు దూరం కావడం నిజం. రెండోది ఆ దూరం కావడం కోసమే ఈ సినిమా చేస్తుండటం. ఈ సినిమా నేపథ్యమే ఈ డౌట్స్‌ క్రియేట్‌ చేస్తోంది.

పొలిటికల్‌ థ్రిల్లర్‌ ద్వారా సమాజంలోకి బలంగా వెళ్లాలని అనుకుంటున్నాడట. నేరుగా వెళ్లే కంటే ముందే సినిమా ద్వారా వెళ్తే ఇంకాస్త బలంగా తన రాజకీయ ఆలోచనల్ని ప్రజల్లోకి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నాడట Vijay విజయ్‌. దీని కోసం ఈ సినిమా చేస్తున్నాడట. అయితే అంతకుమందు చేసే వెంకట్‌ ప్రభుతో చేసే సినిమా కూడా పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ ఉన్న సినిమానే అని సమాచారం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus