Avinash: ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చేవి!: అవినాష్

  • January 6, 2024 / 04:37 PM IST

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అవినాష్ ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో ముక్కు అవినాష్ పేరిట ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా నటుడిగా ఎంతో ఫేమస్ అయినటువంటి అవినాష్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చారు. ఇక బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి అవినాష్ ప్రస్తుతం బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఒకానొక సమయంలో తాను తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆ సమయంలో దిక్కుతోచక తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అవినాష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కరోనాకు ముందు వరకు తనకు మంచిగా అవకాశాలు వచ్చాయని అయితే అప్పుడు కారు ఇల్లు కొనడంతో ఈఎంఐ కట్టాల్సి వచ్చేదని తెలిపారు.

కరోనా కారణంగా లాక్ డౌన్ పడటంతో తనకు అవకాశాలు లేకుండా పోయాయి దీంతో పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అదే సమయంలోనే తనకు బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చిందని అయితే జబర్దస్త్ అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుని బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే పది లక్షలు కట్టమన్నారని ఈయన తెలిపారు. ఆ సమయంలో ఇబ్బంది పడుతున్నటువంటి తనకు శ్రీముఖి అండగా నిలిచి తాను డబ్బు ఏర్పాటు చేసింది అంటూ శ్రీముఖి మంచితనం గురించి అవినాష్ తెలిపారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఇప్పుడు కెరియర్ పరంగా ఎంతో బిజీ అవ్వడమే కాకుండా భారీగా సంపాదిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్నటువంటి అవినాష్ మరికొద్ది రోజులలో తండ్రి కాబోతున్న విషయం కూడా మనకు తెలిసిందే.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus