Mukku Avinash, Anuja: తండ్రి కాబోతున్న ముక్కు అవినాష్!

జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్… బుల్లితెర పై బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఈ మధ్య అతను బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు చెబుతూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఆల్రెడీ సొంతింటి కల నెరవేర్చుకున్నాడు. 2021 లో అనుజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే అవినాష్ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

అంతే కాకుండా తన భార్యతో కలిసి మరిన్ని రియాల్టీ షోలో పాల్గొంటూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అతను అభిమానులతో మరో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు.అతను త్వరలోనే తండ్రి కాబోతున్నాడట. ఈ విషయం పై అతను స్పందిస్తూ.. “నా భార్య అనూజ ప్రస్తుతం 4 నెలల గర్భిణీ. త్వరలోనే మా ఇంట్లోకి పాప లేదా బాబు రాబోతున్నారు. మా పెళ్లై అక్టోబర్ కి రెండేళ్లు పూర్తి కావస్తోంది. పిల్లల్ని ఎప్పుడు కంటారు అని మా పేరెంట్స్, బంధువులు మమ్మల్ని చాలా రోజుల నుండి అడుగుతున్నారు.

ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెబుతున్నాం. పెళ్లైన ఏడాదిన్నరకే మేం తల్లిదండ్రులు కాబోతున్నాం. మూడు నెలల వరకు డాక్టర్ ఎవరికీ చెప్పొదని అన్నారు. ప్రస్తుతం నాలుగో నెల కాబట్టి ఈ సంతోషకరమైన వార్త మీతో షేర్ చేసుకుంటున్నాం. నాలుగో నెలలో బేబీ గుండె చప్పుడు విన్నాం.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మా పేరెంట్స్, తన పేరెంట్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు’ అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus