Shanti Swaroop: జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ ఇల్లు అమ్మేస్తున్నారా.. ఏమైందంటే?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో శాంతిస్వరూప్ ఒకరు. శాంతిస్వరూప్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. శాంతిస్వరూప్ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. శాంతిస్వరూప్ కు సినిమాలలో కూడా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే శాంతిస్వరూప్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఈ ప్రముఖ కమెడియన్ ఇంటిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

అమ్మ ఆరోగ్యం బాలేకపోవడంతో శాంతిస్వరూప్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. శాంతిస్వరూప్ మాట్లాడుతూ అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నానని అన్నారు. అమ్మకు ఆరోగ్యం బాలేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు శాంతిస్వరూప్ కు దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నారు. శాంతిస్వరూప్ తల్లి అనారోగ్య సమస్యల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అమ్మ కోసం (Shanti Swaroop) శాంతిస్వరూప్ చేస్తున్న పనిని ఎంత పొగిడినా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ కోసం శాంతిస్వరూప్ చేస్తున్న త్యాగం గొప్పదని నెటిజన్లు చెబుతున్నారు. అమ్మకు మించింది ఈ సృష్టిలో ఏదీ ఉండదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. శాంతిస్వరూప్ మాట్లాడుతూ ఇన్నిరోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతుందని తెలిపారు. నా ఇంటిని ఎవరు కొనుగోలు చేసినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

శాంతిస్వరూప్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. శాంతిస్వరూప్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శాంతి స్వరూప్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ కు 4,000కు పైగా లైక్స్ వచ్చాయి. శాంతిస్వరూప్ కు జబర్దస్త్ కమెడియన్లు తమ వంతు సాయం చేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus