Faima: సొంత ఇల్లు, కొత్త కారు.. అనుకున్నది సాధించిన ఫైమా!

పటాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి పైమా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరిని నవ్వించి సందడి చేస్తున్నటువంటి ఈమెకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో చేస్తూనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ వచ్చారు. ఇలా తన తల్లిదండ్రులను ఎదిరించి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అయితే ఈ పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశం కూడా అందుకున్నారు.బిగ్ బాస్ హౌస్లో ఏకంగా చివరి వారాల వరకు కొనసాగుతూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి ఫైమా ప్రస్తుతం వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో తనకు ఉన్నటువంటి రెండు కోరికల గురించి ఈమె తెలియజేశారు. తమకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదని ఎప్పటికైనా తన తల్లిదండ్రులకు సొంత ఇల్లు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని అలాగే వారిని ఒక కారులో తిప్పడం

కూడా తన కోరిక అని తెలియజేశారు.ఇలా తల్లిదండ్రుల కోరికను నెరవేర్చడం కోసం కష్టపడుతున్నటువంటి ఫైమా ఎట్టకేలకు ఇంటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ జరుగుతుందని తెలిపారు. ఇక అదే విధంగా తన తల్లిదండ్రుల కోసం ఒక మంచి కారు కొనుగోలు చేస్తున్నానని ఈమె వెల్లడించారు.

ఇప్పటికే తను రెండు కార్లను ఫైనల్ చేసి వాటి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నానని అయితే ఇది అమ్మా నాన్నలకు ఇచ్చే కారు కనుక వారి అభిప్రాయం మేరకు ఫైనల్ చేస్తాననీ చెప్పుకొచ్చారు.ఇలా పైమా ఎట్టకేలకు తన తల్లిదండ్రుల కోరికను నెరవేర్చడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus