Jabardasth Vinod: ఇతరులను నమ్మి 21 లక్షల పోగొట్టుకున్న జబర్దస్త్ కమెడియన్ వినోద్!

జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ వినోద్ గురించి అందరికీ సుపరిచితమే ఈయన వినోదిని లేడీ గెటప్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ కార్యక్రమంలో తన కామెడీ డైలాగులతో అందరిని ఎంతో నవ్వించే జబర్దస్త్ వినోద్ ఇంట్లో ప్రస్తుతం ఆ నవ్వులు కరువయ్యాయని తెలుస్తోంది.ఈయన ఇతరులను నమ్మి దారుణంగా లక్షల్లో డబ్బులు నష్టపోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. జబర్దస్త్ వినోద్ ఈ కార్యక్రమంలో స్కిట్ ల ద్వారా పైసా పైసా కూడా పెట్టి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని భావించారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటిని కొనుగోలు చేయడం కోసం ఇంటి యజమానికి మాటమీద మూడు లక్షలు,అగ్రిమెంట్ ప్రకారం 10 లక్షలు చెల్లించారట అయితే ఆ యజమాని ఇల్లు ఇవ్వకపోగా ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనకు తెలిసిన వారు ఇతరుల వద్ద అప్పు తీసుకుంటూ తనని పూచీగా పెట్టారని అయితే వాళ్లు అప్పు చెల్లించకపోవడంతో తిరిగి ఐదు లక్షల రూపాయలు నేనే అప్పు చెల్లించాలని తెలిపారు.

ఇక గత కొద్దిరోజులుగా తాను లంగ్స్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారని ఇందుకు ట్రీట్మెంట్ కోసం మరో మూడు లక్షల వరకు ఖర్చు చేస్తున్నానని తెలిపారు. ఈ విధంగా ఇతరులను నమ్మి తాను 21 లక్షల రూపాయల కోల్పోయానని జబర్దస్త్ లో సంపాదించినది మొత్తం ఇలా మోసపోయి పోగొట్టుకున్నానంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే డబ్బు కోల్పోయిందని తాను బాధపడుతూ కూర్చొననీ తిరిగి తాను జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా వినోద్ చేసినటువంటి కామెంట్స్ పెరల్ అవుతున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus