నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతి బాబు, ఎన్టీఆర్ పోటీ పడి నటించారు. వారిద్దరి మధ్య ఉండే కాంబినేషన్స్ సీన్స్ అదరగొట్టాయి. మళ్ళీ తారక్, జగ్గూ భాయ్ హీరో, విలన్ గా చేసిన చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో శ్రద్ధ పెట్టి చేసిన ఈ చిత్రం యాక్షన్ సినిమాల్లోనే క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్టీఆర్ తర్వాత వినిపిస్తున్న పేరు జగపతిబాబు. బసి రెడ్డి పాత్రలో అతని నటనకు అందరూ జేజేలు పలుకుతున్నారు. అసలు అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో మీ పాత్ర లేకపోతే సినిమానే లేదు అన్నంత పేరొచ్చింది కదా? అని జగపతిబాబుని ఓ ఇంటర్వ్యూ లో అడగగా.. అతను ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు.
“అది చాలా తప్పు. అలా అనకూడదు. నేను కూడా తారక్ ని ఇదే ప్రశ్న అడిగాను. నీ ధైర్యం ఏంటి? అని అడిగాను. తారక్ నా పాత్ర డామినేట్ చేస్తున్నా నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు? విలన్ పాత్ర డామినేట్ చేస్తోంది కదా! అని అడిగితే “సినిమా పెద్దది.. హీరో పెద్దోడు కాదు అన్నారు. నువ్వు ఎంతయినా చెయ్.. హీరో నేను .. సినిమా నాది.. అంటూ ఎంకరేజ్ చేశారు. బసిరెడ్డి లేకపోతే తారక్ లేడు! అని ప్రమోషన్ లోనూ ఎంకరేజ్ చేశాడు తారక్” అని తారక్ పై జగపతి బాబు ప్రసంశలు గుప్పించారు.