Jagapathi Babu: హీరోగా కుదర్లేదు… విలన్‌గా అవుతోందట!
- October 21, 2021 / 02:11 PM ISTByFilmy Focus
హీరోగా అవకాశాలు తగ్గుతున్నాయి అనగా… విలన్ అవతారం ఎత్తారు జగపతిబాబు. 60 ఏళ్ల వయసులోనూ యంగ్ లుక్‌లో కనిపించాలన్నా ఆయన ముందుకొస్తారు. పూర్తిస్థాయి రాక్షసత్వం చూపించే పాత్ర కావాలన్నా రెడీ అంటారు. మోస్ట్ స్టయిలిష్ రిచ్ విలన్ కావాలన్నా ఆయనే. అలా తన నటనా వైవిధ్యం విలన్‌గానూ చూపిస్తూ వస్తున్నారయన. ఇప్పుడు ఈ వెర్సటాలిటీ బాలీవుడ్‌లో కూడా చూపిస్తారు అంటున్నారు. జగపతి బాబు హీరోగా నటుడిగా తమిళ, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించారు జగపతిబాబు.
అయితే హిందీలో చేయలేదు. తాజాగా ఆ ముచ్చట కూడా తీరబోతోందట. అశుతోష్ గొవారికర్ దర్శకత్వంలో ఫరాన్ అక్తర్ హీరోగా ‘పుకార్’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో మెయిన్ విలన్‌గా జగపతిబాబును తీసుకుంటున్నారని టాక్. ఇప్పటికే రెండుసార్లు ఇలా బాలీవుడ్ అవకాశాలు వచ్చినా జగ్గూభాయ్ ఓకే చెప్పలేదు. అయితే ఈసారి ఓకే చెబుతారని టాక్. ఇక జగపతిబాబు సినిమాల సంగతి చూస్తే… ‘గుడ్ లక్ సఖి’ విడుదలకు సిద్ధంగా ఉంది.

‘గని’, ‘పుష్ప’, ‘లక్ష్య’, ‘సలార్’ సిద్ధమవుతున్నాయి. వీటితోపాటు ‘ఘర్షణ’ అనే ఓ వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తున్నారు జగపతిబాబు. వీటితోపాటే ఆ బాలీవుడ్ సినిమా కూడా అన్నమాట. గతంతో ‘దబంగ్ 3’లో జగపతి నటిస్తున్నారని వార్తలొచ్చాయి. తర్వాత నటించలేదనే విషయం తెలిసిందే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!












