బుల్లితెరపై ప్రసారమైతే రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే… తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా ఉండమని చెప్పి, డబ్బు ఇచ్చి కాలేజ్ ని కాపాడినందుకు మురగన్ కు థాంక్స్ చెప్పి రిషి బయలుదేరి వెళ్లిపోతారు అయితే తాను కారు దగ్గరికి వెళ్లే సమయానికి వసుధార కారులో ఉండడం చూసి నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యపోతాడు. నేను మీరు ఇద్దరు ఒకేదారిలోనే కదా వెళ్లేది అని వసుధార చెప్పడంతో మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి మేడం అని చెబుతారు.
క్యాబ్ బుక్ చేసుకోవడానికి నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు అయినా ఇద్దరం ఒకే చోటుకే కదా సార్ వెళ్ళేది అని అడగడంతో దారి ఒకటైన గమ్యం వేరు అంటూ మాట్లాడుతారు. రిషి అలా మాట్లాడేసరికి వసుధార కోపంతో ఇప్పుడేంటి మీరు నన్ను దిగిపోమంటారా అంటూ సీరియస్ అవ్వడంతో రిషి కారు ముందుకు పోనిస్తాడు. ఇలా వసుదార రిషి ఇద్దరు ఒకే కారులో పోవడం చూసిన మహేంద్ర జగతి సంతోషపడతారు. ఎప్పటికైనా వారిద్దరూ ఒకటే అవుతారు వారి బంధం ఎవరు విడదీయలేరు వాళ్ళు ఎప్పటికైనా రిషిధారలే అంటూ సంతోషపడతారు. ఇక కారులో ప్రయాణిస్తున్నటువంటి వసుధార సమస్యలన్నీ తొలగిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది.
అని ఆనందపడుతూ ఉండగా రిషి అన్ని సమస్యలు తొలగిపోయాయని సంతోష పడకండి మేడం మీరు చేసిన గాయం నేను మర్చిపోలేను అంటూ మాట్లాడుతాడు. మనం జీవితంలో కలిసేది లేదు అంటూ రిషి మాట్లాడటంతో వసుధార నవ్వుతుంది. ఎందుకు మేడం నవ్వుతున్నారు అంటూ రిషి మాట్లాడగా మనం కలవబోము అంటూ ఇలా పక్కపక్కన కూర్చునే ప్రయాణం చేస్తున్నాము అంటూ మాట్లాడుతుంది. ఒక్కసారిగా రిషి కార్ ఆపడంతో ఏం జరిగింది అని ముందుకు చూడగా ఎదురుగా శైలేంద్ర ఉంటారు. ఇక రిషి కారు దిగి మీరేంటి ఇక్కడ అన్నయ్య అని అనడంతో నిన్ను ఇలా చూసిన తర్వాత ఒంటరిగా పంపించడానికి వాళ్ళందరికీ మనసు ఒప్పుకుందేమో కానీ నా మనసు ఒప్పుకోలేదు అంటూ రివర్స్ డ్రామా ప్లే చేస్తారు.
అంతలోపు జగతి మహేంద్ర కూడా అక్కడికి వస్తారు. నువ్వు తిరిగి మన ఇంటికి వచ్చేసే రిషి అని అడగడంతో నేను అక్కడికి రాను అన్నయ్య అంటూ సమాధానం చెబుతారు . పిన్ని వసుధార కారణంగానే నువ్వు ఆ ఇంటికి దూరమయ్యావు కానీ నువ్వు దూరంగా ఉండటం నేను సహించలేకపోతున్నాను నువ్వు ఇంటికి వచ్చేసేయ్ అని బ్రతిమలాడుతారు దాంతో మహేంద్ర జగతి ఆగ్రహం వ్యక్తం చేస్తారు త్వరలోనే రిషికీ నిజ నిజాలు అన్ని తెలుస్తాయి అప్పుడు రిషి తన ఇంటికి తాను తప్పకుండా వస్తారు అంటూ మహేంద్ర మాట్లాడుతారు ఇక రిషి మాత్రం తను ఆ ఇంటికి రానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇక రిషి వెళ్ళిపోగానే మహేంద్ర జగతి శైలేంద్రకు సీరియస్ వార్నింగ్ ఇస్తారు. నువ్వు రిషి ముందు మంచి వాడిలాగా నాటకమాడుతున్నవు కానీ త్వరలోనే నీ నిజ స్వరూపం బయటపడుతుంది అప్పుడు నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు నిజం మా అన్నయ్యకు తెలిసిన రోజు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు అంటూ మహేంద్ర శైలేంద్రకు వార్నింగ్ ఇస్తారు . డాడ్ అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు బాబాయ్ ఆయనని బాధపెట్టే పని మీరు ఏమి చేయరు అలా చేయనంత వరకు నేను సేఫ్ గా ఉంటాను అంటూ సమాధానం చెబుతారు.
మహేంద్ర శైలేంద్ర మాటలకు అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రయాణం చేస్తుండగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు సర్ అంటే ఏమో నాకు తెలియదు అంటూ మాట్లాడతారు అంతలోపే వసుధార ఇల్లు రావడంతో తనని దిగమని చెబుతాడు ఇక వసుధర మీరు కూడా రండి సర్ కాఫీ తాగి వెల్దురు అని పిలిచినప్పటికీ ది రిషి మాత్రం రాడు ఇక చక్రపాణి ఇదంతా చూసి ఏంటమ్మా అల్లుడుగారు అలాగే వెళ్తున్నారు అనడంతో వసుధార జరిగినది చెబుతుంది ఇప్పుడు రిషి సార్ ఇక్కడికి రాలేక ఏంజెల్ ను ఫేస్ చేయలేక ఎక్కడికి వెళ్తారో అంటూ బాధపడుతూ ఉంటుంది.