భారీ రేట్లు పెట్టి డ్రెస్సులు కొనుగోలు చేయడం మహిళలకు, ముఖ్యంగా అమ్మాయిలకు అలవాటు. అలాంటిది స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తున్న, ఫ్యాషన్ సెన్స్‌కు ప్రతిరూపంగా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంటున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన డ్రెస్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం పెద్ద విషయమేమీ కాదు. రీసెంట్‌గా ఆమె ధరించిన క్రిస్మస్ డ్రెస్ ధర కూడా ఇలానే ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పెట్టడం గమనార్హం. జాన్వీ కపూర్ తన క్రిస్మస్ లుక్ని గ్రాండ్గా ప్లాన్ చేసుకుంది.
Janhvi Kapoor
పొట్టి గౌన్లో క్రిస్మస్ ట్రీతో కలిసి ఇటీవల ఫోజులిచ్చింది. ఆ ఫొటోల్లో జాన్వీ భలేగా ఉంది అని చెప్పాలి. బీ నాటీ అంటూ క్రిస్మస్ స్లోగన్ కూడా అదిరిపోయింది. ఇదంతా ఒకతెత్తు అయితే ఆమె ధరించిన డ్రెస్ ధర గురించి వివరాలు బయటకు రావడంతో ఇప్పుడు ఆ విషయమే వైరల్‌గా మారింది. ఆ డ్రెస్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చర్చిస్తున్నారు. ఆ ఫొటోలు చూస్తుంటే స్ట్రాప్ లెస్ మినీ డ్రెస్లో జాన్వీ స్టైలిష్గా, అందంగా కనిపించింది.
చూసేందుకు డ్రెస్ పొట్టిగా ఉన్నా.. ధర మాత్రం గట్టిగానే ఉంది. ఆస్కార్ డె లా రెంటా టీమ్ ఈ డ్రెస్ను డిజైన్ చేసింది. దీని ధర 8990 డాలర్లు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు ఏడున్నర లక్షల రూపాయలు. అయితే ఇప్పుడు 50 శాతం డిస్కౌంట్ మీద 3495 డాలర్లకే వస్తోంది. ఆ లెక్కన చూసిన సుమారు నాలుగు లక్షల రూపాయలు. అంత భారీ రేటు పెట్టి కొన్న డ్రెస్ వేసుకున్నాక మేకప్ కూడా బాగుండాలి కదా.
అందుకే సింపుల్‌గా ఉన్నా స్టైలిష్ మేకప్‌కే ఓటేసింది జాన్వీ. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. ఇటీవల ‘దేవర 1’తో (Devara) తెలుగు వాళ్లను పలకరించింది. రామ్‌చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమాలో నెక్స్ట్ నటిస్తోంది. సౌత్‌తో మరికొన్ని సినిమాలు ఓకే చేసింది అంటున్నారు కానీ ఎక్కడా ఇంకా క్లారిటీ రావడం లేదు.