క్రికెట్ ఆడటం కష్టం. ఆడినోళ్లకే కాదు.. చూసినవాళ్లకు కూడా ఈ విషయం బాగా తెలుసు. ఆడినప్పుడు తగిలే గాయాలే కాదు.. లాంగ్ టైమ్ ఆడటం వల్ల వచ్చే ఇబ్బందులు చాలానే ఉంటాయి. కానీ ఓ సినిమా కోసం హీరోయిన్ ఈ ట్రైనింగ్ తీసుకుంటే ఎంత ఇబ్బంది పడుతుంది. ఎన్ని గాయాలు పాలవుతుంది. ఈ ప్రశ్నలకు మీకు ఆన్సర్ కావాలంటే ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా గురించి తెలియాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా కష్టపడింది.
శ్రీదేవి కూతురిగా.. హో హో ఆగండి. ఇంకెన్నాళ్లు ఆమెను అలా ఇంట్రడక్షన్ చేస్తాం. అందుకే బాలీవుడ్‌లో మాస్ హీరోయిన్‌గా ఎదగడానికి అన్ని ఛాన్స్‌లు ఉన్నా.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు మరోసారి అలాంటి సినిమానే చేసింది. అదే ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’(Mr. & Mrs. Mahi). క్రికెటర్‌గా ఎదరగాలనుకున్న ఓ యువతిగా ఆమె ఆ సినిమాలో నటించింది. అయితే దీనికి కాస్త రొమాన్స్ యాడ్ చేశారు దర్శకుడు శరణ్ శర్మ (Sharan Sharma).
ఈ సినిమా గురించి జాన్వీ కపూర్ ఎంత కష్టపడింది అనే విషయం చెప్పడానికి టీమ్ ఓ వీడియో సిద్ధం చేసింది. దాని ప్రకారం చూస్తే.. ఈ సినిమాల కోసం జాన్వీ 30 రోజులు షూటింగ్ చేసింది. అయితే ఆ సీన్స్ కోసం ఏకంగా 150 రోజులు క్రికెట్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో ఆమెకు రెండు పెద్ద గాయాలు అయ్యాయి. ఈ మొత్తం విషయాలను దిగువ వీడియోలో చూడొచ్చు. దీంతో సినిమా కోసం జాన్వీ అంత కష్టపడిందా అని మీరే అంటారు.
సినిమా కథ చూస్తే.. మహేంద్ర (రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao) క్రికెటర్‌గా ఉన్నత స్థానాలకు ఎదగాలనుకున్నా సాధించలేకపోతాడు. మహిమ (జాన్వీ కపూర్) వైద్యురాలు. పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటవుతారు. అయితే ఇద్దరికీ క్రికెట్ అంటే ప్యాషన్ అని తెలుస్తుంది. దీంతో భార్యలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు శిక్షణ ఇవ్వడం మొదలుపెడతాడు. మరి, ఆమె కలను సాకారం చేసుకుందా అనేదే సినిమా కథ.