Janhvi Kapoor: జాన్వీకపూర్ లగ్జరీ లైఫ్ స్టైల్..మాల్దీవ్స్ విల్లాలో జాన్వీ.. రోజుకి ఎంత చెల్లిస్తుందంటే..?

అలనాటి అందాల తార, దివంగత శ్రీదేవి కూతరు జాన్వీకపూర్ హీరోయిన్ గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లొచ్చింది. విలాసవంతమైన విల్లాలో బస చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. రిస్టీన్ బీచ్‌లు, క్రిస్టల్ క్లియర్ వాటర్, ఎక్సోటిక్ మెరైన్ లైఫ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ సహా మాల్దీవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. విలాసవంతమైన వాటర్ రిసార్ట్‌ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొంతమంది ప్రైవేట్ దీపాల్లో ఉంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

ఇక్కడ ఒక్క రోజు ఉండడానికి లక్షల్లో ఖర్చవుతుంది. జాన్వీ కపూర్ కూడా మాల్దీవులలో తన బస కోసం చాలా ఖరీదైన రిసార్ట్‌ ను సెలెక్ట్ చేసుకుంది. దాని పేరు సోనేవా జానీ. ఈ రిసార్ట్ లో 51 ఓవర్-వాటర్ విల్లాలు, మూడు ఐలాండ్ విల్లాలు ఉన్నాయి. ఈ విల్లాలు చాలా లగ్జరీగా ఉంటాయి. వాటర్‌ స్లైడ్‌లు, ప్రైవేట్ పూల్స్, మాస్టర్ బెడ్‌రూమ్‌పై ముడుచుకునే పైకప్పుతో ఈ విల్లాలను డిజైన్ చేశారు.

ప్రైవేట్ పూల్స్ తో పాటు ఇండోర్, అవుట్‌ డోర్ ప్లేసెస్ లో ఎంజాయ్ చేయడానికి తగిన సదుపాయాలు కూడా ఉన్నాయి. 2 బెడ్‌ రూమ్ వాటర్ రిట్రీట్ విత్ స్లైడ్ విల్లాలో జాన్వీ బస చేసింది. ఈ ఒక్క విల్లా 5,597 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ విల్లాలో అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇందులో ఒక్క రాత్రి గడపడానికి సోనెవా వెబ్‌సైట్ ప్రకారం సుమారు రూ.14 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

జాన్వీ కూడా అంతే చెల్లించి ఈ విల్లాలో బస చేసింది. జాన్వీ లగ్జరీ లైఫ్ స్టైల్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నాయి. సినిమాల ద్వారా జాన్వీ కోట్లు సంపాదిస్తుంది. ఈమె ఒక్కో సినిమాకి రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలానే ప్రమోషన్స్ ద్వారా మరింత ఎక్కువ మొత్తాన్ని సంపాదిస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ పెట్టడానికి జాన్వీ రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు తీసుకుంటుంది. రీసెంట్ గానే ఈమె బాంద్రాలో ఓ డ్యూప్లెక్స్‌ ఇల్లు కొనుక్కుంది. దీని విలువ రూ.65 కోట్లు.

 

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus