Tollywood: తెలుగులో హిట్ సినిమాకు కొత్త పాయింట్.. భలే అంటున్న నెటిజన్లు
- August 17, 2024 / 09:15 PM ISTByFilmy Focus
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. ఏదైనా సినిమాలో సీన్, సాంగ్, కాన్సెప్ట్ హిట్ కొడితే.. ఆ తర్వాత వాటిని మిగిలిన సినిమాల్లో ఎక్కడో ఒక దగ్గర ఫాలో అయిపోతూ ఉంటారు. అలా ఇప్పుడు ఓ సన్నివేశం / కాన్సెప్ట్ టాలీవుడ్‌లో విజయాలకు కారణమవుతోంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే నిజమైతే ఇంకొన్ని సినిమాలు ఇలానే వస్తాయని, ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల్లో ఆ సీన్స్ ఉన్నాయి అని కూడా అంటున్నారు.
Tollywood

సినిమాలో భారీ యాక్షన్ సీన్‌కి జాతరను మించిన ప్లేస్ మరొకటి ఉండదు అంటారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో బెస్ట్ ఫైట్స్ అనిపించుకున్న చాలా ఫైట్ సీన్స్.. జాతర నేపథ్యంలో ఉన్నవే. అయితే రీసెంట్‌గా వచ్చిన, రాబోతున్న సినిమాల్లో ఈ సీన్స్ కీలకంగా ఉండబోతున్నాయి అని చెప్పొచ్చు. ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) సినిమా వచ్చాక ఈ చర్చ మరింతగా జరుగుతోంది. ఆ సినిమాలో ఆ సీన్స్ అదుర్స్ అని చూసినోళ్లు అంటున్నారు.

తారక్ (Jr NTR) – కొరటాల శివ (Koratala Siva) సినిమా ‘దేవర: పార్ట్ 1’లో (Devara) కూడా జాతర సీన్ ఉందని, అదే హైలైట్ అని కూడా అంటున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) సినిమా ‘పుష్ప : ది రూల్’ (Pushpa 2) సినిమాలో జాతర సన్నివేశం ఎంత కీలకమో మనకు తెలిసిందే. సినిమా టీమ్ అయితే ఆ సీన్ ఉందని చెప్పలేదు కానీ.. గంగమ్మ జాతరలో బన్నీ అమ్మవారి గెటప్ ఆడతాడు అని ఓ లుక్ రిలీజ్ చేశారు కూడా. కాబట్టి ఆ సీన్ పక్కా.. దానికి ఈలలు కూడా పక్కా.

ఇక ఇటీవల విడుదలైన సినిమాలను పరిశీలిస్తే.. ఇలాంటి సన్నివేశాలు చాలావాటిలోనే కనిపిస్తాయి. రామ్‌చరణ్ (Ram Charan) – సుకుమార్ ‘రంగస్థలం’ (Rangasthalam) .. చిరంజీవి (Chiranjeevi) – రవితేజ (Ravi Teja) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) , రవితేజ – గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ‘క్రాక్’ (Krack), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) – అజయ్ భూపతి (Ajay Bhupathi) ‘మంగళవారం’ (Mangalavaaram) .. ఇలా చాలా సినిమాలే ఉన్నాయి ఈ వరుసలో. మరి రాబోయే సినిమాల్లో ఎన్నింటిలో ఈ సీన్స్ వస్తాయో చూడాలి.











