Jawan Movie: ‘జవాన్’ కూడా ఆ సినిమాకి కాపీనా..?

మొన్నటి వరకు హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలను చూసి.. కొంచెం అటు ఇటు మార్చేసి తెలుగులో తీసేవారు టాలీవుడ్ దర్శకులు. ఇందుకు ఎగ్జామ్పుల్స్ చాలానే ఉన్నాయి. సుకుమార్, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఇదే ఫార్ములా అప్లై చేశారు. అయితే నెటిజన్లు ఈ విషయాన్ని తొందరగానే కనిపెట్టేయడంతో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అయితే త్రివిక్రమ్ మాత్రం పాత సినిమాల కథలకు కొంచెం మోడ్రన్ టచ్ ఇచ్చేసి కానిచ్చేస్తున్నాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమా ‘ఇంటి గుట్టు’ నుండి లేపిందే.

‘అఆ’ అయితే ‘మీనా’ సినిమా ఆధారంగా రూపొందిందే. దర్శకుడు కొరటాల శివ కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోడు. తమిళ దర్శకుడు అట్లీ కూడా ఇదే ఫార్ములాని అప్లై చేస్తున్నాడు. మణిరత్నం తీసిన ‘మౌనరాగం’ ని కొంచెం అటు ఇటు మార్చి ‘రాజా రాణి’ గా తీశాడు. మన ‘సంతోషం’ సినిమా పోలికలు కూడా కొన్ని ఉంటాయి. ఇక రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాల స్పూర్తితో విజయ్ ‘అదిరింది’ ని తీసాడు.

వెంకటేష్ నటించిన ‘గణేష్’ సినిమా పోలికలు కూడా ఇందులో ఉంటాయి. ఇక హాలీవుడ్ సినిమా ‘హోమ్ ఫ్రంట్’ని కొద్దిగా మార్చి ‘పోలీస్’ గా తీసాడు.’బిగిల్’ సినిమాలో కూడా చాలా తెలుగు సినిమాల పోలికలు కనిపిస్తాయి. ఇప్పుడు షారుక్ తో చేస్తున్న ‘జవాన్’ విషయంలో కూడా అంతే అని టాక్..! ఈ సినిమాలో షారుక్ ఖాన్ తండ్రి, కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.

భారతీ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైదీ వేట'(ఓరు ఖైదీయిన్ డైరీ) ని ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus