సీనియర్ నటి జయసుధ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి ఇలా చాలా మందితో కలిసి నటించింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ నిర్మాతగా కూడా మారారు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తను నిర్మాతగా ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె.
అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘హ్యాండ్సప్’ సినిమా గురించి మాట్లాడారు. నిర్మాతగా మారిన తరువాత ఆమె తీసిన ‘ఆత్మబంధువులు’, ‘కాంచన సీత’ సినిమాలు సక్సెస్ కావడంతో ఆమెకి మంచి లాభాలు వచ్చాయట. ఆ తరువాత హిందీలో జితేంద్ర హీరోగా ‘మేరా పతి సిర్ఫ్ మేరా హై’ అనే సినిమా చేశారట. ఆ సినిమా నష్టాలను తీసుకొచ్చిందట.
ఆ తరువాత చేసిన ‘వింతకోడలు’ సినిమా పూర్తి నష్టాలను మిగిల్చిందని చెప్పుకొచ్చింది జయసుధ. అలా కొంచెం కొంచెం నష్టపోతూ వచ్చానని.. చివరగా ‘హ్యాండ్సప్’ అనే సినిమా చేశానని.. అందులో చిరంజీవి గారు ఓ చిన్న క్యారెక్టర్ చేశారని చెప్పింది. అయితే సినిమా రిలీజ్ అయ్యేవరకు అందులో ఆయన ఉన్నారనే విషయం కూడా ఎవరికీ తెలియదని చెప్పింది జయసుధ.
ఆయన పోస్టర్ వేసినా.. ఓపెనింగ్స్ వచ్చేవేమో.. పోస్టర్ వేద్దామంటే ఆయన వద్దన్నారని అప్పటివిషయాలను గుర్తుచేసుకుంది జయసుధ. అప్పటివరకు తెలుగు సినిమాల్లో స్టార్స్ ఎవరూ గెస్ట్ రోల్ చేయలేదని.. ఒకవేళ పోస్టర్ వేసి ఉంటే పెద్ద క్యారెక్టర్ ని ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి.. మా హీరో చిన్న రోల్ చేశాడని ఫీల్ అవుతారని భావించి చిరంజీవి గారు వద్దని చెప్పినట్లు జయసుధ వివరించింది. కానీ ఆయన ఆలోచన బెడిసికొట్టిందని.. సినిమాకి ఓపెనింగ్స్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది.