JD Chakravarthy: చైతన్య మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జేడీ!

దిల్ రాజు నిర్మాతగా వాసువర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన జోష్ సినిమాతో అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ కు పరిచయమయ్యారు. 2009 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. కథ, కథనం ఆకట్టుకునేలా లేకపోవడంతో పాటు ఈ సినిమా పాటలు కూడా హిట్ కాలేదు. ఈ సినిమాలో నాగచైతన్య లుక్స్ విషయంలో కూడా నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాలో చైతన్యకు విలన్ గా జేడీ చక్రవర్తి నటించారు.

జేడీ చక్రవర్తి సినిమాలో తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినా తన నటనతో మెప్పించారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ఈ షోకు జేడీ చక్రవర్తి గెస్ట్ గా హాజరయ్యారు. జోష్ సినిమాలోని అన్నయ్యొచ్చినాడో పాటతో జేడీ చక్రవర్తి షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జేడీ చక్రవర్తి ఎవడ్రా ఈ పాట సజెస్ట్ చేసింది ఎవరు ఎవరికి అన్నయ్య అని చెప్పగా రామ్ ప్రసాద్ తన తొలిసినిమా జోష్ అని చెప్పారు.

ఆ సినిమాలో గోడ బ్యాచ్ అని ఉంటుందని రామ్ ప్రసాద్ చెప్పగా అప్పటినుంచి గోడమీదేనా అంటూ జేడీ చక్రవర్తి పంచ్ వేశారు. రామ్ ప్రసాద్ జోష్ లో ఉన్నాడనే మాట బాధ కలిగించిందని జేడీ చక్రవర్తి చెప్పగా జనాలకు కూడా గుర్తు లేదని గుర్తు చేయవద్దని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో నేనున్నట్టు కూడా ఎవరికీ తెలియదని చెబుతూ జేడీ చక్రవర్తి పంచ్ వేశారు. జనవరి 30వ తేదీన మధ్యాహ్నం ఒకటికి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

చైతన్య తొలి సినిమా అయిన జోష్ లో నటించినా నేనున్నట్టు ఎవరికీ తెలియదంటూ జేడీ చక్రవర్తి చేసిన షాకింగ్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. జోష్ సినిమా ఫ్లాప్ అయినా తర్వాత సినిమాలతో చైతన్య ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న చైతన్య బంగార్రాజు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus