ప్రముఖ హీరో రాజశేఖర్, ఆయన భార్య, నటి జీవిత తమకు భారీ మొత్తంలో డబ్బు ఎగ్గొట్టారని జోస్టర్ ఫిలిం ఫౌండర్ కోటేశ్వరరాజు, ఆయన భార్య హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. కోటేశ్వరరాజు దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. జీవితా రాజశేఖర్ దంపతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారు మంచివారని నమ్మి మోసపోయామని చెప్పుకొచ్చారు. ‘గరుడవేగ’ సినిమా నిర్మాణం కోసం రూ.26 కోట్లు అప్పుగా ఇచ్చామని తెలిపారు కోటేశ్వరరాజు దంపతులు. అప్పు తీసుకునే సమయంలో తమకు తాకట్టు పెట్టిన భూములను తరువాత కాలంలో బినామీ పేర్లతో రాయించి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు.
రాజశేఖర్ తండ్రి వరదరాజన్ చెప్పడం వలనే అప్పు ఇచ్చామని అన్నారు. జీవిత రాజశేఖర్ దంపతులు తమకు ఇచ్చిన చెక్ లు కూడా బౌన్స్ అయ్యాయని వాపోయారు. తాము అప్పుగా ఇచ్చినట్లు, అలానే వాళ్ల డాక్యుమెంట్స్ ఇలా పక్కా ఆధారాలు తమ దగ్గరున్నాయని వారు చెప్పుకొచ్చారు. జీవిత, రాజశేఖర్ లకు అప్పు ఇచ్చి తాము ఎంతో నష్టపోయామని.. జీవితా దంపతుల కోసం తాము అప్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా..
అప్పు చెల్లిస్తామని చెప్పి.. ఇప్పుడు తామెవరో తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్‌బెయిల్ వారెంట్ జారీ చేసింది. దీనిపై జీవితరాజశేఖర్ స్పందించారు. ”మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై రేపు (ఏప్రిల్ 23) జరగబోయే ‘శేఖర్’ సినిమా విలేఖరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తా.
అప్పటి వరకు ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని మనవి” అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘శేఖర్’ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించారు. అలానే ఆయన కూతురు శివానీ రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!