తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జెర్సీ’ సినిమా హిందీ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీమేక్ పై కాపీ రైట్ కేసు దాఖలైంది. ఇప్పుడు ఈ పిటిషన్ పై విచారణ సాగుతోంది. హిందీ ‘జెర్సీ’ సినిమా విడుదల ఆపాలని.. ఈ సినిమా కథ తను రాసిందని.. ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కోర్టు నుంచి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు వచ్చాయి.
ఈ కథ తనదంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి ఈ సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకోండి అంటూ ఈ సినిమా దర్శకనిర్మాతలకు కోర్టు సూచించింది. అలానే ఈ కథ తనదని అంటోన్న వ్యక్తికి కీలకమైన ప్రశ్నను సంధిస్తూనే.. ఇదే సమయంలో అతడికి ఈ బాలీవుడ్ సినిమా ప్రొడ్యూసర్లు కథా రచనలో క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకోవాలని కోర్టు చెప్పింది. ‘జెర్సీ’ సినిమా ముందుగా తెలుగులో వచ్చింది కదా..? దానికి రీమేక్ గా హిందీలో సినిమాను రూపొందిస్తున్నారు..
అలాన్తప్పుడు నువ్ తెలుగు సినిమాపై ఎందుకు పిటిషన్ వేయలేదని కోర్టు సదరు రచయితను ప్రశ్నించింది. 2007లోనే తను ఆ కథను రాసుకున్నట్లుగా అతడు కోర్టుకి చెబుతున్నాడు. తెలుగు సినిమా వచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడగ్గా.. దీనిపై అతడి లాయర్ స్పందించాడు. తన క్లయింట్ నేటివ్ స్పీకర్ కాదని.. దీంతో అతడికి సినిమా వచ్చిందన్న విషయం కూడా తెలియడానికి కోర్టుకి వెల్లడించాడు. తెలుగులో తన కథను కాపీ కొట్టిన విషయం తన క్లయింట్ కు తర్వాత తెలిసిందని..
అదే కథ హిందీ రీమేక్ నేఫథ్యంలో కోర్టును ఆశ్రయించినట్టుగా ఆ లాయర్ చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా టైటిల్ కార్డ్స్ లో పిటిషనర్ కి క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకోమని సూచించింది కోర్టు. మరి దీనిపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!