Jr NTR, Allu Arjun: ఎన్టీఆర్- అల్లు అర్జున్ వాళ్లు నటించబోయే మల్లీస్టారర్ మూవీ ఇదేనా?

‘మా హీరో గొప్ప’ అంటే… ‘మా హీరోనే గొప్ప’ అంటూ ఫ్యాన్స్‌ కొట్టుకొంటారు కానీ, హీరోలు మాత్రం స్నేహంగానే ఉంటారు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది. ఒకప్పుడు మెగా, నందమూరి హీరోల మధ్య గట్టి పోటీ ఉండేది. ఫ్యాన్స్‌ వార్స్‌ నడిచేవి. ఇప్పుడు ఆ హీరోలే… దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఆప్యాయంగా కలిసిపోతున్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్‌ – రామ్‌ చరణ్‌ లు కలిసి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (RRR) చేశారు.

ఈ సినిమాతో వీరిద్దరి బాండింగ్‌ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ – అల్లు అర్జున్‌ లు ఓ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్‌ టాక్‌. ఎన్టీఆర్‌ బన్నీ ఇద్దరూ ‘బావా.. బావా’ అని పిలుచుకొంటారు. వాళ్ల మధ్య అంత అనుబంధం ఉంది. మొన్నామధ్య బన్నీ పుట్టిన రోజున ‘పార్టీ లేదా బావా’ అంటూ సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ ఓ ట్వీట్‌ చేసి, వాళ్ల మధ్య ఉన్న మైత్రిని మరోసారి బయటపెట్టాడు.

అప్పటి నుంచీ వీరిద్దరూ వెండి తెరపై కలసి నటిస్తే చూడాలన్న ఆశ అభిమానులలో మరింత పెరిగింది. ఆ ఊహ త్వరలోనే నిజం కాబోతోందన్నది ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. జియో స్డూడియోస్‌ సంస్థ బాలీవుడ్‌లో ‘అశ్వద్ధామ’ పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మించే పనిలో ఉంది. ఇదో మల్టీస్టారర్‌. విక్కీ కౌశల్‌, రణ్‌వీర్‌ సింగ్‌లతో ఈ సినిమాని పట్టాలెక్కిద్దామనుకొన్నారు. అయితే వాళ్ల ఆలోచనలు మారాయి.

(Jr NTR) ఎన్టీఆర్‌, బన్నీలతో ఈ ప్రాజెక్ట్‌ చేస్తే పాన్‌ ఇండియా పరంగా మంచి క్రేజ్‌ వస్తుందని జియో స్డూడియోస్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఓ అగ్ర దర్శకుడి ఆధ్వర్యంలో స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. అది పూర్తయ్యాకే ఈ ప్రాజెక్టుపై ఓ స్పష్టత వస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఈ బావలిద్దరూ కలిస్తే మాత్రం బాక్సాఫీసు బద్దలే. ఈ సమయం కోసం ఇరు హీరోల ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus