ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటోలు!

దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్‌) 27వ వర్ధంతి నేడు. దీంతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడానికి వెళ్లారు.ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌ లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘ఎన్టీఆర్‌ కుమారుడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతమని…. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను ఎవ్వరూ మరిచిపోరని….

కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం కేవలం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైందని…. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని…. మాట తప్పని వ్యక్తిత్వం ఆయనదని…. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఆయనని, తెలుగుదేశం రూపంలో తమకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని’.. ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus