హీరోలకు డూప్స్ ఉంటారు, వాళ్లే యాక్షన్ సీన్స్ చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా కొట్టుకుంటారు కూడా. అయితే.. మొదటిసారి ఒక డోప్ ని స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేసి, కష్టమంతా అతనిదే అని కితాబు ఇచ్చిన మొట్టమొదటి హీరో మాత్రం ప్రభాస్. బాహుబలి ఈవెంట్ లో తన డూప్ కిరణ్ రాజ్ ఫోటో చూపించి మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు ప్రభాస్.
మరే ఇతర హీరోలు ఇలా స్టేజ్ మీద తమ డూప్స్ ని పరిచయం చేసిన పాపాన పోలేదు. అయితే.. రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఎన్టీఆర్ (Jr NTR) డూప్ ఈశ్వర్ హరీష్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లిప్స్ కట్ చేసి వేరే హీరోల అభిమానులు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా.. “ఆర్ఆర్ఆర్” (RRR) సినిమాలో కీలక సన్నివేశాలు తానే చేశానని, రీసెంట్ గా జెప్టో యాడ్ లో కూడా తాను నటించినట్లు, అప్పటికే ఎన్టీఆర్ చాలా వీక్ గా ఉన్నాడని, హృతిక్ రోషన్ (Hrithik Roshan) ని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదని పేర్కొన్నాడు.
ఇంక ఆ ఒక్క క్లిప్ పట్టుకొని నానా హంగామా చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే.. గత కొన్ని రోజులుగా హీరోల సగం రెమ్యునరేషన్ డూప్స్ అడుగుతున్నారని, షూటింగులు కూడా దాదాపుగా వాళ్లతోనే పూర్తి చేస్తున్నారని మీడియాలో కొన్ని విషయాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈశ్వర్ హరీష్ ఇంటర్వూకి, అతడి మాటలకి ఎక్కడలేని ప్రాధాన్యత ఏర్పడింది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఇబ్బందిపెడుతున్న ఈ స్టేట్మెంట్స్ లేదా ఇంటర్వ్యూస్ ని ఈశ్వర్ కొన్ని రోజులు ఎవాయిడ్ చేస్తే బెటర్.