Jr NTR: ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదుర్స్ అనేలా ఉన్నాడుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రోల్ లో నటించినా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే. మరో 17 రోజుల్లో తారక్ పుట్టినరోజు కావడం, తారక్ బర్త్ డే కానుకగా సింహాద్రి రీరిలీజ్ కానుండటంతో తారక్ పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తారక్ ఫ్యాన్స్ ఒక పోస్టర్ ను క్రియేట్ చేయగా ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్30 సినిమా నుంచి ఈ నెల 20వ తేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ కానుండగా ఆ పోస్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పోస్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఆ పోస్టర్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఎన్టీఆర్30లో తారక్ డ్యూయల్ రోల్ చేస్తుండగా పెద్ద ఎన్టీఆర్ లుక్ తారక్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో (Jr NTR) తారక్ సిగరెట్ తాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తారక్ మరో చేతిలో గన్ ఉంది. ఎంతో అభిమానం ఉంటే మాత్రమే ఈ స్థాయిలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను క్రియేట్ చేయడం సాధ్యమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్ కు యంగ్ జనరేషన్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ పెరుగుతుండగా ఫ్యాన్స్ కోసం తారక్ ఎంతగానో కష్టపడుతున్నారు. 80 కోట్ల రూపాయలకు రెమ్యునరేషన్ ను పెంచేసిన తారక్ తర్వాత సినిమాలతో సక్సెస్ సాధిస్తే లాభాల్లో వాటా కూడా సొంతం చేసుకున్నారు.

తారక్ బడెట్ విషయంలో రాజీ పడకూడదనే కారణంతో సొంత బ్యానర్ లో సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగేలా ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus