జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తారక్ ను మాస్ ఫ్యాన్స్ కు దగ్గర చేసింది. కొన్ని నెలల క్రితం ఈ సినిమా రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. అయితే సింహాద్రి (Simhadri) రీరిలీజ్ కలెక్షన్లను తారక్ అభిమానులు ఒక మంచి పని కోసం ఉపయోగిస్తున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆదేశాల మేరకు రీరిలీజ్ కలెక్షన్లలో కొంత మొత్తాన్ని ఫ్యాన్స్ పేదలకు పంచుతున్నారని భోగట్టా.
ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొంతమంది పేదలకు ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత మొత్తాన్ని సహాయం చేశారని తెలుస్తోంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పనులు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. సమాజంపై తారక్ కు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఫ్యాన్స్ చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక ఆలయానికి విరాళం ఇవ్వడం ద్వారా కూడా తారక్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
మరికొన్ని గంటల్లో దేవర (Devara) మూవీ నుంచి ఫియర్ సాంగ్ విడుదల కానుండగా ఈ సాంగ్ ఒకింత స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. దేవర ఫస్ట్ సింగిల్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమాలో ప్రతి సీన్ స్పెషల్ గా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమా ఫ్యాన్స్ కు కచ్చితంగా స్పెషల్ మూవీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.