Jr NTR: ఆ అరుదైన రికార్డ్ ను తారక్ సాధిస్తారా?

ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు ఒక సినిమా సక్సెస్ సాధిస్తే ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో డీలా పడుతున్నారు. ఒక సినిమా సక్సెస్ సాధిస్తే తర్వాత సినిమా ఫ్లాప్ అవుతూ ఆ హీరోకు, ఆ హీరోల అభిమానులకు ఊహించని షాక్ ఇస్తుండటం గమనార్హం. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన పవర్ చూపిస్తూ మార్కెట్ పెంచుకుంటున్నారు.

టెంపర్ నుంచి తారక్ నటించిన ప్రతి సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఒక సినిమా కథకు మరో సినిమా కథకు ఏ మాత్రం పొంతన లేకుండా తారక్ కథలను ఎంచుకుంటున్న విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తారక్ సినిమా రిలీజైతే మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటూ ఫస్ట్ వీకెండ్ కు రికార్డ్ రేంజ్ లో కలెక్షన్లను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ కు ముందే ఇతర భాషల్లో తారక్ కు క్రేజ్ ఉంది.

అయితే ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తారక్ మార్కెట్ ను భారీ రేంజ్ లో పెంచడంతో పాటు ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పించింది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుని ట్రిపుల్ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఎన్టీఆర్30 కొరటాల శివ డైరెక్షన్ లో, ఎన్టీఆర్31 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా త్వరలో ఎన్టీఆర్32 డైరెక్టర్ కు సంబంధించి స్పష్టత రానుంది. వరుసగా 9 విజయాలను సొంతం చేసుకుంటే ఆ రికార్డ్ రేర్ రికార్డ్ గా నిలిచే అవకాశం ఉంది. ఆరు విజయాలను సొంతం చేసుకున్న తారక్ తొమ్మిది విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పేరు మారుమ్రోగేలా చేసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus